Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మూడు రాజధానుల ఏర్పాటు ఖాయం: తేల్చిచెప్పిన సజ్జల

మూడు రాజధానుల ఏర్పాటు ఖాయం: తేల్చిచెప్పిన సజ్జల
-అధికార వికేంద్రీకరణ పక్కా… పరిపాలన రాజధాని విశాఖ నే
-రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా జగన్ పర్యటన సాగింది
-శాసన మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది
-ప్రత్యేక హోదా అంశం చంద్రబాబు వదిలినా,జగన్ వదల్లేదు
-జగన్ పర్యటన వ్యక్తిగతం కాదు

మూడు రాజధానులు విషయం లో అధికారంలో ఉన్న వైకాపా వెనక్కు తగ్గడంలేదు. శాసనసభలో తీర్మానం చేసింది మొదలు విశాఖ , కర్నూల్ , అమరావతి రాజధానులుగా పరిపాలన సాగించాలని అడుగులు వేస్తుంది . కొంత మంది హైకోర్టు ను ఆశ్రయించడం తో కొంత సాంకేతిక సమస్యల వల్ల వెనక్కు పోయినప్పటికీ ఏ క్షణం నుంచెయినా విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని ఇటీవలనే సీనియర్ మంత్రి బొత్స ప్రకటించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో జరిపిన చర్చలలో మూడు రాజధానుల అంశం తో పాటు వివిధ విషయాలను ప్రస్తావించారని సమాచారం. కర్నూల్ న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ దానికి సంబందించిన ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం కేంద్ర మంత్రిని కోరినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే .

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం, విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంతోపాటు పలు అభివృద్ధి అంశాలపై జగన్ కేంద్రంతో చర్చించారని తెలిపారు. ఏపీలో అధికార వికేంద్రీకరణ ఖాయమని, మూడు రాజధానుల ఏర్పాటు పక్కా అని సజ్జల తేల్చి చెప్పారు.

చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని నీరు గారిస్తే తాము మాత్రం దాని కోసం పోరాడుతున్నామన్నారు. జగన్ పర్యటన వ్యక్తిగతం కాదని, రాష్ట్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగిందని అన్నారు. శాసనమండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దానిని రద్దు చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సజ్జల పేర్కొన్నారు.

Related posts

మోదీగారూ, మీ ముఖాన్ని మేము ఎన్నిసార్లు చూడాలి?: మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శ!

Drukpadam

రైతుల వద్ద కేంద్రం గురించి కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: పియూష్ గోయల్…

Drukpadam

బెడిసి కొట్టిన బీజేపీ వ్యూహం …బెంగాల్ లో దిదికే పట్టం

Drukpadam

Leave a Comment