Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముంబై లో లేడీ కానిస్టేబుల్ ఔదార్యం – ఉన్నతాధికారుల సెల్యూట్…

ముంబై లో లేడీ కానిస్టేబుల్ ఔదార్యం – ఉన్నతాధికారుల సెల్యూట్
-నిరుపేద బాలల పట్ల ముంబయి లేడీ కానిస్టేబుల్ మంచి మనసు
-ముంబయిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రెహానా
-50 మంది పేద బాలలను దత్తత-వారిని 10వ తరగతి వరకు చదివించాలని నిర్ణయం
-రెహానా నిర్ణయానికి కుటుంబ సహకారం

పెద్ద పెద్ద ఆస్తులున్న తోటివారికి సహాయపడేందుకు ఇష్టపడరు …. కనీసం వారి గురించి ఆలోచించరు…కాని ఆమెకు ఆస్తులులేవు …. పెద్ద ఉద్యోగం కాదు …. చేస్తున్నది కానిస్టేబుల్ ఉద్యోగం … మనసు మాత్రం పెద్దదిగా నిరూపించారు ముంబై లేడీ కానిస్టేబుల్ రెహానా … పేద పిల్లలను దత్తత తీసుకోని వారిని చదివిస్తున్నారు…. పిల్లలు ఒకరు ఇద్దరు కాదు … ఏకంగా 50 మంది …. వారి ఆలనాపాలనా చూస్తున్నారు…. వారంతా ఒకే స్కూల్ కు చెందిన వారు …. సమయం దొరికితే వారితో గడిపేందుకే ఆమె ఇష్టపడతారు…. ఇది ఆమె గొప్ప హృదయానికి నిదర్శనం …. ఆమె చేస్తున్న సేవలను గురించి తెలుసుకున్న ముంబై పోలీసులు అధికారులు ఆశ్చర్యానికి గురిఅయ్యారు…. ఆమె పెద్ద మనసుకు సెల్యూట్ చేస్తున్నారు….

వివరాల లోకి వెళ్ళితే….

ముంబయిలో పోలీసు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే షేక్ రెహానా ఓ ప్రత్యేకమైన మహిళ. పోలీసు విధులు నిర్వర్తించడమే కాదు, సమాజం పట్ల బాధ్యతతో నిరుపేద బాలబాలికల చదువుకు సహకరిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు. చాలామందిలో ఖాకీలంటే కాస్త కఠినమైన మనస్తత్వంతో ఉంటారన్న భావన నెలకొని ఉంటుంది. కానీ రెహానాను చూస్తే తమ అభిప్రాయం తప్పని తెలుసుకుంటారు.

ఒకరు కాదు, ఇద్దరు కాదు… ఏకంగా 50 మంది పిల్లలను ఆమె దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తున్నారు. వారంతా ఒకే స్కూలుకు చెందిన బాలలు. విధి నిర్వహణలో ఏమాత్రం విరామం దొరికినా, ఆ చిన్నారుల కోసమే సమయ్యాన్ని వెచ్చిస్తారు.

రెహానాకు ఈ విషయంలో కుటుంబ సభ్యులు అండ పుష్కలంగా ఉంది. ఆమె భర్త కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ లోనే పనిచేస్తున్నారు. రెహానా కుటుంబంలో ఆరుగురు సభ్యులు ఉండగా, అటు వారందరికీ ఏర్పాట్లు చేసి, ఇటు 50 మంది పిల్లల విద్యా బాధ్యతలు చూసుకుంటూ ఓ మహిళ ఏంచేయగలదో నిరూపిస్తున్నారు.

కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఓ ఫ్రెండ్ చూపించిన కొన్ని ఫొటోలు ఆమెలోని సేవా దృక్పథాన్ని మేల్కొలిపాయి. ఆ ఫొటోలు ఓ పాఠశాల చిన్నారులకు సంబంధించినవి. దుర్భర దారిద్ర్యంతో ఉన్న ఆ చిన్నారులకు 10వ తరగతి వరకు విద్యా ఖర్చులను భరించాలని ఆ క్షణానే నిర్ణయించుకున్నారు. రెహానా మంచి మనసుతో చేస్తున్న ఈ పని పట్ల పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందిస్తున్నారు

 

Related posts

7 Kylie Jenner Hairstyles You’ve Probably Forgotten About

Drukpadam

లఖింపూర్ కేసు: యూపీ సర్కారు తీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అక్టోబరు 3న ఘటన!

Drukpadam

వివేకా హత్యకు ముందు, తర్వాత… ఫోన్ కాల్స్ వివరాలు కోర్టుకు ఇచ్చిన సీబీఐ…!

Drukpadam

Leave a Comment