రాష్ట్రపతి బరిలో శరద్ పవార్.. రాజకీయవర్గాలలో ఆశక్తికర చర్చ

రాష్ట్రపతి బరిలో శరద్ పవార్.. రాజకీయవర్గాలలో ఆశక్తికర చర్చ
ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించినట్లు ప్రచారం
రెండు రోజుల క్రితం శరద్ పవార్‌తో పీకే భేటీ
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచన
మరాఠా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

భారత రాజకీయాలలో ఎన్నికల వ్యూహకర్తగా అనేక పార్టీలకు గెలుపులను అందించిన ప్రశాంత్ కిషోర్ సరికొత్త ఆలోచనలతో ముందుకు పోతున్నారు. భారత రాష్ట్రపతి పదవికి జరగనున్న ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవర్ పోటీచేయాలని ప్రశాంత కిషోర్ ప్రతిపాదించినట్లు మరాఠా రాజకీల్లో చర్చ జరుగుతుంది.

ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ని ప్రకటిస్తే తాను ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు పనిచేస్తానని ప్రకటించిన విషయం విదితమే …. అయితే అంతకుముందే 2022 లో రాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది . ఎలెక్ట్రోల్ కాలేజీ లో సభ్యుల ఆధారంగా రాష్ట్రపతిని ఎన్నికుంటారు. ప్రస్తుతం సంఖ్యాబలం ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి పూర్తీ మెజార్టీ ఉంది.

అందువల్ల ప్రతిపక్షాల అభ్యర్థి గెలిచే ఛాన్స్ లేదు. కాని ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఇదొక ప్లాటుఫారం . ప్రతిపక్షాల నుంచి అభ్యర్థిగా ఎవరిని పెడితే భారత రాజకీయాలలో కీలక చేర్చ జరుగుతుంది అంటే శరద్ పవర్ లాంటి రాజకీయ ఉద్దండుడు అయితే ప్రతిపక్షాల ఐక్యతకు మార్గం ఏర్పడుతుంది . ఎవరు నిలిచినా బీజేపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థే రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో రాజకీయాలలో అపరచాణిక్యుడిగా పేరున్న మరాఠా యోధుడు బరిలో నిలిచేందుకు అంగీకరిస్తారా ? అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ ప్రతిపాదన వెనక పెద్ద వ్యూహమే ఉందనే అభిప్రాయాలు రాజకీయవర్గాలలో ఉన్నాయి. శరద్ పవర్ అంటే మిగతా పార్టీలు కూడా అంగీకరించే అవకాశం ఉంది. ఇప్పుడు 12 రాష్ట్రాలలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నాయి. శరద్ పవర్ పోటీలో ఉంటె ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచాయనే ప్రచారం ఉంటుంది. దానితో 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికీ ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు మార్గం సులువు అవుతుంది. అయితే అందుకు మరాఠా యోధుడు ఒప్పుకుంటారా ? అనేది ప్రశాంత్ కిషోర్ ముందున్న ప్రశ్న …. శరద్ పవర్ తో జరిగిన లంచ్ మీటింగ్లో దేశరాజకీలపై వివిధ కోణాల్లో లోతుగా చర్చించినట్లు తెలుస్తుంది. వివిధ పార్టీల బలాబలాలు , బీజేపీ బలం బలహీనతలపై వారి మధ్య ఆశక్తికర చర్చ జరిగిందని మహారాష్ట్ర లో ప్రచారం … దీనిపై శరద్ పవర్ గాని ఎన్సీపీ వర్గాలు గాని నోరుఇప్పలేదు. దేశంలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది.

మోడీ నాయకత్వంలో రెండవసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొదటిసారి పరిపాలనపై పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ రెండవసారి వచ్చిన తరువాత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ప్రత్యేకించి వ్యవసాయ చట్టాలు రద్దుపై జరుగుతున్న ఉద్యమం , జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు , కరోనా విషయంలో వైఫల్యాలు మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయి.

మొన్న ముంబైకి ప్రత్యేకంగా వెళ్లిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీపై రాజకీయవర్గాలు ఆరా తీస్తున్నాయి . త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను బరిలోకి దించే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ ఆయనకు సూచించినట్టు మరాఠా రాజకీయ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఉన్న నేతల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నేత ఆయనేనని, కాబట్టి ఎన్నికల బరిలోకి దిగాలని ప్రశాంత్ కిశోర్ కోరినట్టు తెలుస్తోంది.

మరోవైపు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కనుక బీజేపీకే బలం ఎక్కువగా ఉంది. ఆ పార్టీ నుంచి బరిలోకి దిగే అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పోటీ చేసేందుకు శరద్ పవార్ అంగీకరిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఆయన నిత్యం ప్రజల్లో ఉండడానికే ఇష్టపడతారని, అలాంటిది రాష్ట్రపతి భవన్‌కు పరిమితం కావడానికి ఆయన అంగీకరించకపోవచ్చని కూడా చెబుతున్నారు. రాష్ట్రపతి పోటీ విషయంలో బయట పలు వార్తలు షికార్లు చేస్తున్నా ఎన్సీపీ మాత్రం రాష్ట్రపతి ఎన్నిక విషయంలో స్పష్టత నివ్వలేదు …

పీకే ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోలేదు ….ఎన్సీపీ వర్గాలు
ప్రతిపక్షాలను ఏకం చేయాలనీ పవర్ సాబ్ కోరుకుంటున్నారని వివరణ

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ తర్వాత ‘మహా’ రాజకీయాల్లో జరుగుతున్న చర్చపై ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ స్పష్టత ఇచ్చారు. పీకేను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోలేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక విషయమై ఆయన ఇలాంటి స్పష్టతనివ్వలేదు . అయితే, ప్రశాంత్ కిశోర్‌పై మాత్రం మాలిక్ ప్రశంసలు కురిపించారు. ఆయన గొప్ప వ్యూహకర్త అని కొనియాడారు. శరద్ పవార్‌, పీకే మధ్య భేటీలో ప్రతిపక్షాలను ఏకం చేయడంపైనే చర్చ జరిగిందని అన్నారు.

‘‘ప్రశాంత్ కిశోర్‌ను ఎన్సీపీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోలేదు. ప్రతిపక్షాలను ఏకం చేయాలని పవార్ సాబ్ కోరుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు మున్ముందు కూడా కొనసాగుతాయి’’ అని మాలిక్ చెప్పుకొచ్చారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వ్యూహకర్తగా పనిచేసిన డీఎంకే, టీఎంసీ విజయం సాధించిన తర్వాత.. ఇకపై ఏ పార్టీకీ తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని పీకే స్పష్టం చేశారు. అయితే, ఇన్నాళ్లకు మళ్లీ శరద్ పవార్‌ను కలవడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

కాగా, పీకేను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నట్టు వచ్చిన వార్తలను శరద్ పవార్ మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా కొట్టిపడేశారు. శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీ తర్వాత అటు శరద్ పవార్ కానీ, ఇటు పీకే కానీ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

Leave a Reply

%d bloggers like this: