Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ప్రశాంత్ కిశోర్?

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ప్రశాంత్ కిశోర్?
నిన్న సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటీ
కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ప్రచారం
కాంగ్రెస్ లో కీలక పాత్రను ఆశిస్తున్న ప్రశాంత్

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారా? ఆయన కాంగ్రెస్ లో మంచి పొజిషన్ ఆశిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు …. ఎన్నికలకు వ్యూహాలని రచించడంలో ఆయన దిట్ట తలపండిన రాజకీయనేతలు సైతం ప్రశాంత్ కిషోర్ సలహాలకు క్యూలు కడుతున్నారు. అనేక రాష్ట్రాలలో ఆయన తన వ్యూహాల ద్వారా అధికారాన్ని అందించి సెక్సెస్ అయ్యారు. ప్రధానంగా బెంగాల్ ఎన్నికల్లో ఆయన జోశ్యం 100 శాతం నిమమైంది. బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని ,మోడీ అమిత్ షా లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సందర్భంలో బీజేపీకి అంత సీన్ లేదని ప్రకటించారు. అంతే కానుందా బీజేపీకి 100 సీట్ల లోపే వస్తాయని బల్ల గుద్ది మరి వాదించారు. అందువల్ల ప్రశాంత కిషోర్ వ్యూహాలకు రాజకీనా నేతలు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన సోనియా , రాహుల్ , ప్రియాంక గాంధీలని కలిసి వారితో సుదీర్ఘ చర్చలు జరిపారు. దీంతో ఆయన రాజకీయాలపైనే చర్చలు జరిపారని ప్రత్యేకించి పార్టీ చేరే విషయం , ఆయన స్తానం పై చర్చలు జరిగి ఉండవచ్చుననే వార్తలు వైరల్ అవుతున్నాయి.

అందువల్ల ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో నిన్న ప్రశాంత్ కిశోర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు, 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలపై వీరు చర్చించారని పైకి చెపుతున్నప్పటికీ… అంతకు మించినది ఏదో జరగబోతోందని కాంగ్రెస్ పార్టీ వర్గాలే అంటున్నాయి.

2024 ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రను ప్రశాంత్ కిశోర్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్… ఆ పార్టీ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన మాట్లాడుతూ… ఇకపై తాను వ్యూహకర్తగా పని చేయబోనని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్నకు బదులుగా… తానొక విఫల నేతనని చెప్పారు. గతంలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూలో చేరిన ప్రశాంత్ కిశోర్… ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్లబోతున్నట్టు చెపుతున్నారు.

Related posts

కోవర్టుల మాటలపై బీజేపీలో వార్ …ఉలిక్కి పడ్డ రాములమ్మ …!

Drukpadam

ట్రంప్ జైలుకెళితే 2024 ఎన్నికల్లో పోటీ చేయొచ్చా?

Drukpadam

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం దీదీ ప్రయత్నాలు!

Drukpadam

Leave a Comment