Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కలకోట గ్రామంలో కరివేద పద్ధతిలో వడ్లను పొలంలో చల్లి సాగు…

కలకోట గ్రామంలో కరివేద పద్ధతిలో వడ్లను పొలంలో చల్లి సాగు
-పాల్గొన్న జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల , విత్తనాభిరుద్ది సంస్థ చైర్మన్ కొండబాల
-ఆదర్శ రైతు దశరథ్ పంట పొలంలో కరివేద పద్దతిలో సాగు

బోనకల్లు మండలం కలకోట గ్రామం లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మన్నలను పొందిన ఆదర్శ రైతు దశరథ్ పంట పొలంలో వరి నాటు వేసే ప్రక్రియ కాకుండా కరివేద పద్ధతిలో వడ్లను పొలంలో చల్లిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ,విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ అత్యంత ఆధునిక పద్ధతులు అవలంబించి తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం వచ్చే విధంగా అధునాతన వ్యవసాయం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ద్వారా మన్నలను పొందిన దశరథ పొలంలో ఒడ్లు చల్లడం జరిగింది, రైతులందరూ నారు పోసి, నాటేసే పద్ధతి ద్వారా ఎక్కువ పెట్టుబడి అవుతుంది కావున, డైరెక్ట్ గా కరివేద పద్ధతిలో ఒడ్లు చల్లడం వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని రైతులందరూ ఈ పద్ధతిని అవలంభించాలని అధికారులు కూడా రైతులకు అవగాహన కలిగించాలని రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అలాంటి అన్నదాతలు మేలు జరిగే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అభివృద్ధి ప్రదాత రైతు పక్షపాతి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతుల కోసం ఎంతో కృషి చేస్తున్నారు అని అధికారులు,మనమందరంకూడ కృషి చేసి రైతులను అభివృద్ధి పదంలో నడిపించాలనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో బోనకల్ మండలం రైతులు,మధిర నియోజకవర్గ టీఆర్ యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

ఎన్ని వత్తిళ్లు తెచ్చిన రాజీనామా చేయబోను …బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ !

Drukpadam

శ్రీలంకలో అధ్యక్ష భవనం ముట్టడి …రంగంలోకి సైన్యం ….

Drukpadam

బీహార్ ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల భారీ జరిమానా…!

Drukpadam

Leave a Comment