Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మమత పిటిషన్ ను మరో హైకోర్టుకు బదిలీ చేయండి: సుప్రీంను కోరిన సువేందు అధికారి

  • ఇటీవల బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు
  • నందిగ్రామ్ లో మమతపై సువేందు గెలుపు
  • కోల్ కతా హైకోర్టులో మమత పిటిషన్
  • కోల్ కతా హైకోర్టులో విచారణపై సువేందు అభ్యంతరం

ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలుపొందారు. అయితే, సువేందు గెలుపుపై మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

అయితే దీనిపై సువేందు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను కోల్ కతా హైకోర్టులో విచారించరాదని, ఆ పిటిషన్ ను మరో హైకోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్ మినహా మరెక్కడ విచారణ జరిపినా ఫర్వాలేదని పేర్కొన్నారు.

Related posts

అధికారికంగా ఎయిరిండియా పగ్గాలు అందుకున్న టాటా గ్రూప్!

Drukpadam

నేపాల్ ప్రభుత్వ తీరుతో లక్షలాది రూపాయల పరిహారాన్ని కోల్పోబోతున్న విమాన ప్రమాద మృతుల కుటుంబాలు!

Drukpadam

నా ఔషధానికి ఇంకా అనుమతులు రాలేదు… ఆనందయ్య…

Drukpadam

Leave a Comment