పార్టీ ప్రెసిడెంటా గా ? లేదా లోకసభాపక్షనేతగా?? రాహుల్ గాంధీ

పార్టీ ప్రెసిడెంటా గా ? లేదా లోకసభాపక్షనేతగా?? రాహుల్ గాంధీ
-పార్టీ ప్రెసిడెంట్ గా కమల్ నాథ్ ,లోకసభ పక్షనేతగా రాహుల్ ???
-పార్టీ అధ్యక్షురాలుగా 2024 వరకు సోనియా నే అధ్యక్షురాలుగా కొనసాగే అవకాశం
-మూడు ప్రతిపాదనతో సిద్దమౌతున్న పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ
-పార్టీలోని రాష్ట్రాలనేతల మధ్య తగాదాలు -పరిస్కారం కోసం కుస్తీలు

దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతాబాగాలేదు…ఇది కాంగ్రెస్ పార్టీ వారితో సహా
అందరు అంగీకరిస్తున్న సత్యం …. ప్రజలు ఇంకా కొన్ని రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ ను ఆదరిస్తున్నా అంతర్గత కలహాలతో సతమతం అవుతుంది. జి -23 నేతల కోరిక మేరకు పార్టీలో మెరుపులు తీసుకురావాలనే అభిప్రాయంతో సోనియా ఉన్నట్లు తెలుస్తుంది.
రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్ష భద్యతలు తీసుకోవాలని ఇప్పటికి కొందరు కోరుతున్నారు. అయితే ఆయన మాత్రం గాంధీ యేతర కుటుంబం నుంచి పార్టీ అధ్యక్షనియామకం జరగాలని గట్టిగ కోరుతున్నారు . తాను అధ్యక్ష భాద్యతలు స్వీకరించేందుకు ససేమీరా అంటున్నారు. అయితే పార్టీలో నెలొకొన్న సంక్షోభాన్ని నివారించాలని పట్టుదలతో ఉన్న సోనియా గాంధీ మూడుప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
మొదటిది .….. రాహుల్ గాంధీ అధ్యక్ష భాద్యతలు చేపట్టడం లేదా లోకసభలో నాయకుడిగా వ్యవహరించడం … దీనిపై ఎప్పటినుంచో కాంగ్రెస్ లో చర్చ జరుగుతుంది. అధ్యక్ష భాద్యతలు కానుందా లోకసభ పక్ష నేతగా వ్యవహరించాలని వత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు పార్టీ లో ఆయన పేరుకు సోనియా అధ్యక్ష రాలు అయినప్పటికీ దాదాపు పార్టీలో ఆయన చెప్పిందే వేదం … రాహుల్ గాంధీ అధ్యక్ష భాద్యతలు స్వీకరించకపోతే ఆ భాద్యతను మధ్యప్రదేశ్ మాజీముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం .
రెండవది ….. పార్టీ లోకసభ పక్ష నేతగా రాహుల్ గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు .

మూడవది …. 2024 వరకు సోనియాగాంధీ నే అధ్యక్షురాలుగా కొనసాగటం …. సోనియా గాంధీకి పార్టీ రాజకీయసలహాదారుగా కమల్ నాథ్ వ్యవహరించడం …ఇప్పటివరకు తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్న సోనియాగాంధీ పూర్తీ స్థాయి అధ్యక్ష భాద్యతలు స్వీకరించడం అనే ప్రతిపాదనలు ఉన్నాయి . అయితే ఆమె ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుంది.అనేది కూడా పార్టీలో చర్చనీయాంశంగా ఉంది. పూర్తి భాద్యతలు స్వీకరించేందుకు ఆమె అంగీకరిస్తారా ? లేదా అనే సందేహం … కష్టాలలో ఉన్న పార్టీని గట్టు ఎక్కించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీనియర్ నేతలతో ఒక కమిటీ ఏర్పాటు… ఇప్పటికే ఏఐసీసీ లో 23 మంది సీనియర్ నేతలు పార్టీలో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే …

ఆందోళన కరంగా ఉన్న రాష్ట్రాలలో కుమ్ములాటలు

కాంగ్రెస్ హైకమాండ్ తలమునకలై ఉండగా కొన్ని రాష్ట్రాలలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు పార్టీలో ఆందోళన కరంగా ఉన్నాయి. పంజాబ్ లో సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ ,నవజ్యోత్ సింగ్ మధ్య పోరు ఇబ్బంది కరంగా ఉండగా ,హర్యానాలో మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా , కుమారి సెల్జా మధ్య నెలకొన్న తగాదా ఎటు దారితీస్తుందో అర్థం కావడం లేదు రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గెలహాట్ మధ్య యుద్ధం జరుగుంతుంది .ఇక దక్షణాదినా కాస్త బలంగా ఉన్న కర్ణాటక లో మాజీ సీఎం సిద్దరామయ్య , పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మధ్య వార్ నడుస్తుంది. ఈ నేపథ్యం కాంగ్రెస్ పార్టీని గట్టు ఎక్కించగల నాయకుడి కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ కు రాహుల్ తప్ప ప్రత్యాన్మాయం కనిపించడం లేదు .ఏమి జరుగుతుందో చూద్దాం …

Leave a Reply

%d bloggers like this: