డీఎస్ గా పిలవబడే డి శ్రీనివాస్ ఆశక్తికర వ్యాఖ్యలు!

డీఎస్ గా పిలవబడే డి శ్రీనివాస్ ఆశక్తికర వ్యాఖ్యలు
నేను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదంటున్న టీఆర్ఎస్ ఎంపీ డీఎస్
కార్య‌క్ర‌మాల‌కు రావాలంటూ టీఆర్‌ఎస్‌ నుంచి ఆహ్వానాలు రావట్లేవు
నేను అస‌లు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ స‌భ్యుడినేనా?
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌నే అడగాలి
మా ఇంట్లో మూడూ పార్టీలంటూ కొంద‌రు విమ‌ర్శ‌లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నాయకుడు పీసీసీ అధ్యక్షుడుగా రాష్ట్ర రాజకీయాలను చక్రం తిప్పారు .వైయస్ ముఖ్యమంత్రి గా ఉండగా పీసీసీ అధ్యక్షుడుగా శ్రీనివాస్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది .వై యస్ కాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా డి శ్రీనివాస్ కె అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది . అలంటి రాజకీయ అనుభవం ఉన్న డి యస్ ప్రస్తుతం టీఆర్ యస్ తరుపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదని అంటున్నారు . ఒకే ఇంట్లో భార్యాభర్తలు వేరు వేరు పార్టీలలో ఉంటున్నారని మాఇంట్లో మూడు పార్టీలు ఉంటె తప్పేమిటని ఆయన అంటున్నారు .

టీఆర్ఎస్ ఎంపీ ధ‌ర్మపురి శ్రీ‌నివాస్ కుమారుడు ధ‌ర్మపురి అర‌వింద్ బీజేపీ ఎంపీగా కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. డీఎస్ పెద్ద కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్‌లో చేర‌నున్నారు. తాను కాంగ్రెస్‌లో పుట్టి పెరిగాన‌ని, త‌న తండ్రి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరానని, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చడం కోసం తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు నిన్న స్పష్టం చేశారు.

దీంతో ఒకే ఇంట్లో మూడు పార్టీలు అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై డీఎస్ స్పందించారు. తాను ఏ పార్టీలో ఉన్నానన్న విషయం త‌నకే తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ప‌లు కార్య‌క్ర‌మాల‌కు రావాలంటూ టీఆర్‌ఎస్‌ నుంచి త‌నకు ఆహ్వానాలు రావడం లేదని ఆయ‌న చెప్పారు. తాను అస‌లు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ స‌భ్యుడినేనా అన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌నే అడగాలని వ్యాఖ్యానించారు.

ఒకే ఇంట్లో మూడూ పార్టీలంటూ తమపై కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, చాలామంది ఎంపీల ఇళ్లల్లో భార్య ఒక పార్టీలో, భర్త ఇంకో పార్టీలో ఉన్నారని ఆయ‌న చెప్పారు. తాను గ‌తంలో పీసీసీ అధ్య‌క్షుడిగా చక్రం తిప్పానని తెలిపారు. త‌న కుమారుడు అరవింద్‌ బీజేపీలో చేరిన‌ప్పుడు కూడా తాను వ్యతిరేకించలేదని ఆయన చెప్పారు. అర‌వింద్ కష్టపడి గెలిచి లోక్‌స‌భ స‌భ్యుడు అయ్యాడని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Leave a Reply

%d bloggers like this: