Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రపతి పదవి రేసులో లేనని తేల్చేసిన శరద్ పవార్!

రాష్ట్రపతి పదవి రేసులో లేనని తేల్చేసిన శరద్ పవార్!
-రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై స్పష్టత నిచ్చిన శరద్ పవార్
-పార్లమెంటులో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ
-ఎన్డీయే అభ్యర్థికే గెలుపు అవకాశాల నేపథ్యంలో వెనక్కి?
-కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనం అంశం పై స్పందించిన త్రిపాఠి

భారత్ రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్ పవర్ పోటీచేస్తారని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది . ఎన్డీఏ మెజార్టీ కలిగి ఉందని అందువల్ల పోటీచేసిన బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు ఖాయమని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. శరద్ పవర్ సైతం 2022 జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు జరుగుతన్న ఊహాగానాలకు తెరపడింది . పార్లమెంట్ లో సైతం ఎన్డీయే కు స్పష్టమైన మెజార్టీ ఉంది . బీజేపీ నిరణయించిన అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థిలో రాజకీయాల్లో తలపండిన నేతగా ఉన్న శరద్ పవర్ పోటీ చేయడం ఆయన రాజకీయ ప్రస్థానంలో వెలితిగా ఉంటుందని ఎన్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వరసగా రెండు మూడు భేటీ అవడంతో శరద్ పవర్ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలకు పదును పెరిగింది.

శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున బరిలోకి దిగబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండుసార్లు శరద్ పవార్‌తో భేటీ కావడం, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పవార్ ఇటీవల భేటీ కావడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది.

ఇటీవల ఈ వార్తలు మరింత జోరందుకోవడంతో శరద్ పవార్ స్పందించారు. రాష్ట్రపతి పదవి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. పార్లమెంటులో ఎన్డీయేకు కావాల్సిన మెజారిటీ ఉండడంతో ఆ కూటమి నుంచి బరిలోకి దిగే అభ్యర్థే గెలిచే అవకాశం ఉంటుందని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. కాబట్టి పవార్ బరిలోకి దిగే అవకాశం లేదని స్పష్టం చేశాయి.

ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి డిపి త్రిపాఠి సైతం శరద్ పవర్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం స్పందిస్తూ రాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా చాల సమయం ఉంది. ప్రతిపక్షాల అభ్యర్థి గెలవంటే ఇంకా 15000 ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఎన్నికల నాటికీ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు జరగవచ్చు అని అన్నారు. అధికార పార్టీ ప్రతిపక్షాలను రాష్ట్రపతి ఎన్నికల్లో సంప్రదిస్తుందా ?లేదా ? అందరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థి ని పోటీలో నిలబడుతుందా? లేదా చూడాలని అన్నారు.
ఎన్సీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే కాంగ్రెస్ నేత థామస్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ లో మెర్జర్ అనేది ఉహాజనితమైంది … తాము ఎమర్జ్ కావాలని చూస్తున్నప్పుడు మెర్జర్ మాటకు అవకాశమే లేదని అన్నారు. థామస్ తమ మిత్రులైన శరద్ పవర్ , మమతా బెనర్జీ లు తమ పూర్వపు పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరాలని పిలుపునిచ్చారు….

Related posts

రాహుల్ పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

Drukpadam

అమ‌రావ‌తి రైతులు చేసింది త్యాగ‌మెలా అవుతుంది?: మంత్రి బొత్స 

Drukpadam

ఏపీ గవర్నర్ ను కలిసిన టీడీపీ ప్రతినిధుల బృందం…

Drukpadam

Leave a Comment