Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ కు నో ఛాన్స్ ….అధిర్ రంజాన్ చౌదరినే కాంగ్రెస్ పక్ష నేత….

రాహుల్ కు నో ఛాన్స్ ….అధిర్ రంజాన్ చౌదరినే   కాంగ్రెస్ పక్ష నేత…
-కాంగ్రెస్ అధికారిక ప్రకటన విడుదల
-కాంగ్రెస్ పక్ష నేతగా అనేక మంది పేర్ల పరిశీలన
-చివరకు ఈసారికి మార్పు లేకుండానే చిన్న చిన్న మార్పులతో కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ లోకసభ లో తమ పక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఈసారికి కూడా యువనేత రాహుల్ కు నో ఛాన్స్ అన్నారు. … లోకసభలో కాంగ్రెస్ పక్ష నేతగా పశ్చిమ బెంగాల్ కు చెందిన అధిర్ రంజాన్ చౌదరి ని కొనసాగితుస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ప్రకటించారు. 13 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలంకు ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం సీనియర్ నేతలకు భాద్యతలను అప్పగించారు. కరోనా సెకండ్ వేవ్ ,.. వ్యవసాయ బిల్లులపై ….ఆర్థిక వ్యవస్థ ,…. పరిశ్రమల మూత,పెరుగుతున్న నిరుద్యోగం……. చైనా బోర్డర్ లో పరిస్థితులు …. రఫెల్ అంశం పై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం సమీపించింది. సోమవారం నుంచి లోక్‌సభ, రాజ్యసభలు సమావేశం కానున్నాయి. వచ్చేనెల 13వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తంగా 19 రోజుల పాటు పార్లమెంట్ సమావేశమౌతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రొటోకాల్స్ మధ్య పార్లమెంట్ సమావేశమౌతుంది.

ప్రతి సభ్యుడికీ కరోనా వైద్య పరీక్షలను నిర్వహించిన తరువాతే.. సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన తరువాత తొలిసారిగా పార్లమెంట్ సమావేశం కానుంది. కొత్తగా లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు అప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా వ్యవహరిస్తోన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని ఆ హోదా నుంచి తప్పిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగింది.

అధిర్ రంజన్‌ను పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో ఆయన స్థానంలో యువ ఎంపీలకు అవకాశం కల్పిస్తారంటూ వార్తలొచ్చాయి. అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చలేదు. సభాపక్ష నేతగా అధిర్ రంజన్ చౌదరిని కొనసాగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఈ మేరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం- లోక్‌సభలో అధిర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ పక్ష నేతగా కొనసాగుతారు. అస్సాంకు చెందిన గౌరవ్ గొగొయ్ ఉప సభాపక్ష నేతగా వ్యవహరిస్తారు. కేరళకు చెందిన కోడికున్నిల్ సురేష్ చీఫ్ విప్‌గా, రవ్‌నీత్ సింగ్ బిట్టు, మాణిక్కం ఠాగూర్ విప్‌లుగా ఉంటారు.

మనీష్ తివారీ, శశిథరూర్ పార్టీ తరఫున రోజువారీ సభపక్ష వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గె కొనసాగుతారు. ఉప నేతగా ఆనంద్ శర్మ, చీఫ్ విప్‌గా జైరామ్ రమేష్ ఉంటారు. కేంద్ర మాజీమంత్రులు అంబికా సోని, పీ చిదంబరం, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్ పార్టీ సభ్యులను సమన్వయ పరుస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts

భారత రాజకీయాల్లో మరో కొత్త జాతీయపార్టీ ..బీఆర్ యస్!

Drukpadam

అక్టోబ‌ర్ 24న తెలంగాణ‌లోకి రాహుల్ గాంధీ యాత్ర‌…

Drukpadam

ఎంపీ ఫైజల్ పై అనర్హత వేటును ఎత్తివేసిన లోక్ సభ!

Drukpadam

Leave a Comment