Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీఆర్ఎస్‌ను వీడ‌నున్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌పై స్పందించిన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి

  • నా ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం ఇలా ప్ర‌చారం చేస్తోంది
  • ఆ ప్రచారంలో నిజం లేదు
  • ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు
  • నేను పార్టీ మార‌బోను

తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి పార్టీ మార‌తారని ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డితో ఆయ‌న‌కు ఉన్న విభేదాలే ఇందుకు కార‌ణ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ అంశం తాండూరులో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మ‌హేంద‌ర్ రెడ్డి స్పందిస్తూ మండిప‌డ్డారు.

తాను టీఆర్‌ఎస్‌ను వీడుతున్నాన‌ని త‌న ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం చేస్తున్న ప్రచారం నిజం కాద‌ని వ్యాఖ్యానించారు. త‌న‌పై కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విష ప్రచారం చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. తాను పార్టీ మార‌బోన‌ని తెలిపారు. తాను పార్టీ మారుతున్న‌ట్లు అసత్య ప్రచారం చేస్తున్న వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు

కాగా, కాంగ్రెస్‌లో చేరేందుకు పట్నం మహేందర్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్లు ఊహాగానాలు వ‌చ్చాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేందర్‌రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఆయ‌న టీఆర్ఎస్‌ను వీడితే ఆ పార్టీకి న‌ష్ట‌మేన‌ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మహేందర్‌రెడ్డి 2014లో టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్‌ఎస్ లో చేరారు. ఆయ‌న టీఆర్ఎస్‌లో చేరిన త‌ర్వాతే ఆ పార్టీ రంగారెడ్డి జిల్లాలో బ‌లోపేత‌మైందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు. అయితే, గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు.

Related posts

కన్ఫర్మ్ టికెట్ కోసం రైల్వే శాఖ కొత్త పథకం!

Drukpadam

ఒక్క గుడ్డుతో 15 మందికి ఆమ్లెట్!

Drukpadam

చంద్రబాబును విచారించే తొమ్మిది మంది సీఐడీ అధికారులు వీరే!

Ram Narayana

Leave a Comment