Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రేవంత్, షర్మిల, ఈటలకు పోటీగా తీన్మార్ మల్లన్న.. వచ్చే నెల నుంచే.. ఢిల్లీ సీఎంకు ఆహ్వానం

తెలంగాణలో పాదయాత్రల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే తాము పాదయాత్రలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నాయకుడు ఈటల రాజేందర్, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న కూడా చేరారు. వచ్చే నెలాఖరు నుంచి తన పాదయాత్ర మొదలు పెట్టనున్నట్లుగా ఆదివారం తీన్మార్ మల్లన్న ప్రకటించారు.

ఆదివారం తీన్మార్ మల్లన్న ఘట్‌కేసర్ మండల పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో తన అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సమయంలోనే తన పాదయాత్ర కార్యాచారణను ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆగస్టు 29 నుంచి తన పాదయాత్ర ప్రారంభించనున్నట్లుగా తీన్మార్ మల్లన్న వెల్లడించారు. ఈ తన పాదయాత్రకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే, తనకు ఇతర పార్టీల్లో చేరాలని ఆఫర్లు వచ్చాయని అన్నారు. షర్మిల పార్టీ గురించి స్పందిస్తూ ఆమెకు ఆధార్, ఓటర్ కార్డులు ఎక్కడి అడ్రస్‌తో ఉన్నాయో చూసుకోవాలని ఎద్దేవా చేశారు.

కొద్ది నెలల క్రితం జరిగిన నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతోనే ఓటమి చెందారు. అయితే, పోటీ మాత్రం తీవ్రంగా ఇవ్వగలిగారు. దీంతో స్వతంత్ర అభ్యర్థికి ఈ స్థాయిలో ఓట్లు రావడంపై అప్పట్లో చర్చ సాగింది.

రాజకీయ వేడి మొదలైంది. పాదయాత్ర చేస్తామని ఇప్పటికే పలువురు నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తీన్మార్‌ మల్లన్న కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో తన అభిమానులతో మల్లన్న సమావేశమయ్యారు. ఆగస్టు 29న జోగులాంబ గద్వాల్‌ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తీన్మార్‌ మల్లన్న ప్రకటించారు. పాదయాత్రకు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. తమ పార్టీలో చేరాలంటూ కొందరు నేతలు ఆహ్వానించారని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు ఎక్కడ ఉందో చెప్పాలని మల్లన్న డిమాండ్‌ చేశారు.

Related posts

లిక్కర్ స్కాంలో ఐదు టీవీ చానళ్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!

Drukpadam

కరోనా కట్టడిలో కోర్టు వ్యాఖ్యలు మోదీ, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ద్వజం

Drukpadam

ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న కవిత!

Drukpadam

Leave a Comment