ఇంకా భ్రమల్లో బతుకుతున్న కాంగ్రెస్ …బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మోడీ ధ్వజం…

ఇంకా భ్రమల్లో బతుకుతున్న కాంగ్రెస్ …బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మోడీ ధ్వజం
-కాంగ్రెస్ పార్టీ పతనమవుతున్నప్పటికీ… మా గురించి ఆందోళన చెందుతోంది
-బీజేపీ అధికారంలో ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది
-కాంగ్రెస్ ఏమీ చేయలేదనే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు
-అధికారం కోసమే ఉన్నామనే భ్రమల్లో కాంగ్రెస్ ఉంటుంది

ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లో కాంగ్రెస్ బతుకుతుందని ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .పార్లమెంట్లో జరుగుతున్నా పరిణామాలపట్ల మోడీ విపక్షాలపై స్పందించారు.విపక్షాల తీరు బాధ్యతారహితంగా ఉందని విమర్శించారు.
బీజేపీ అధికారంలో ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అసోం, బెంగాల్, కేరళలో ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ ఇంకా కోమా నుంచి బయటకు రాలేదని అన్నారు. బీజేపీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల తీరు బాధ్యతారహితంగా ఉందని, ఇది చాలా దురదృష్టమని అన్నారు.

60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదనే కారణంతోనే బీజేపీకి దేశ ప్రజలు పట్టం కట్టారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని మోదీ చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ… ఆ పని చేయడం లేదని అన్నారు. అధికారం కోసమే తమ పార్టీ ఉందనే భ్రమల్లో కాంగ్రెస్ ఉంటుందని, ప్రజా తీర్పును కూడా ఆ పార్టీ పట్టించుకోదని విమర్శించారు. పతనావస్థలో ఉన్న తమ పార్టీ గురించి కాకుండా, ఎప్పుడూ బీజేపీ గురించి అది ఆందోళన చెందుతుంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మారకపోతే ఇప్పుడు ఉన్న స్థితి కూడా ఉండదని అన్నారు . ఇంకా పాత వాసనలు పోకుండా అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి బీజేపీ అధికారంలో ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: