తెలంగాణ లో భూముల దరలు పెంపు అమలు…

తెలంగాణ లో భూముల దరలు పెంపు అమలు
-30 నుంచి 50 శాతం పెరిగిన ధరలు
-ఈ నెల 22 పెరిగిన ధరలు అమలు
-మంగళవారం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ లు

ఎప్పటి నుంచే అనుకున్న భూముల ధరలను పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నది . పెపుదలను వ్యవసాయ వ్యాసాయేతర భూములకు వర్తింపజేస్తూ రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ప్రజల ప్రత్యేకించి కొనుగోలు దారులనుంచి విమర్శలకు కారణమైయ్యే అవకాశాలు ఉన్నాయి.

. రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ షచేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ జీవో నెంబర్ 58 ని విడుదల చేశారు. ఎల్లుండి అనగా జూలై 22వ తేదీ నుంచి భూముల కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా, ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో భూముల ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ల్యాండ్ మార్కెట్ విలువ పెరిగితే రాష్ట్ర ఖజానా నిండుకోవడమే కాకుండా రియల్ ఎస్టేట్‌లో బ్లాక్ దందాకు కూడా చెక్ పడుతుంది. దీనితోనే కేసీఆర్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల విలువ ప్రాంతాల వారీగా పెరగ్గా..వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు మార్కెట్ విలువలు కూడా పెరిగాయి. ఇక పెరిగిన ధరలపై ఓ లుక్కేస్తే.!

వ్యవసాయ భూములకు అత్యల్ప విలువను ఎకరానికి రూ. 75,000గా నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం వ్యవసాయ భూముల రేట్లు.. అవి ఉన్న పరిధి మేరకు పెరిగాయి. తక్కువ పరిధిలో ఉన్నవి 50 శాతం పెరగగా, మధ్య పరిధిలోని భూములు 40 శాతం, హైరేంజ్‌లోని భూముల ధరలు 30 శాతం పెరిగాయి. అదేవిధంగా, ఓపెన్ ప్లాట్ల విషయానికి వస్తే.. అతి తక్కువ విలువ పలికే ప్లాట్లు ఒక చదరపు గజం రూ. 200గా నిర్ణయించారు. అటు ఓపెన్ ప్లాట్లు తక్కువ పరిధిలోనివి 50 శాతం, మిడ్ రేంజ్‌లోని ఉన్నవి 40 శాతం, హైరేంజ్‌లోని ప్లాట్ల ధరలు 30 శాతం మేరకు పెరిగాయి.

Leave a Reply

%d bloggers like this: