Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇదో లోకం … పెగాసస్ పై కుమారస్వామి స్పందన…

ఇదో లోకం … పెగాసస్ పై కుమారస్వామి స్పందన
ఫోన్ ట్యాపింగుల గురించి పట్టించుకోవాల్సిన పని లేదంటున్న మాజీ సీఎం
దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్
ఫోన్ ట్యాపింగులు 10 నుంచి 15 ఏళ్లుగా జరుగుతున్నాయన్న స్వామి
గతంలో ప్రభుత్వాలు, ఐటీ శాఖ ప్రజల ఫోన్లను ట్యాప్ చేసేవి వున్న కుమారస్వామి

పెగాసస్ స్పైవేర్ ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ స్పైవేర్ ను ఉపయోగించి పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని, ఫోన్లపై నిఘా ఉంచారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. పార్లమెంటును సైతం ఈ అంశం కుదిపేస్తోంది. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి ఈ స్పైవేరే కారణమంటూ మీడియాలో వస్తున్న కథనాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగులు గత 10 నుంచి 15 ఏళ్లుగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఫోన్లను గతంలో ప్రభుత్వాలు, ఆదాయపు పన్ను శాఖ ట్యాప్ చేసేవని చెప్పారు. మన దేశంలో ఏ ప్రభుత్వాలైనా, ఏ పార్టీలయినా, సమాచారం కోసమో లేదా వారి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమో ఇలా చేస్తుంటాయని అన్నారు. ఇలాంటి అంశాలను సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

Related posts

ఏపీ మంత్రి సిదిర అప్పలరాజు కు సీఎం పర్యటనలో అవమానం!

Drukpadam

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ నేతల ముప్పేట దాడి…

Ram Narayana

కర్నూలులో చంద్రబాబు ఆవేశం చూసి బాధేసింది: యనమల!

Drukpadam

Leave a Comment