Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌పై కరీంనగర్‌లో కేసు నమోదు…

మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌పై కరీంనగర్‌లో కేసు నమోదు…
స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ప్రవీణ్ కుమార్
హిందూ దేవతలను అవమానించారంటూ అభియోగాలు
కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రవీణ్ కుమార్ రాజీనామాను ఆమోదిస్తూ నోటిఫికేషన్ జారీ
ఆయన స్థానంలో రొనాల్డ్ రోస్‌కు గురుకులాల బాధ్యతలు
రాజకీయ పార్టీలకు అమ్ముడుపోనన్న ప్రవీణ్ కుమార్
రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు: ప్రవీణ్‌కుమార్‌
ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్
రాజకీయాల్లోకి రాబోతున్నారంటున్న ఆయన సన్నిహితులు
త్వరలోనే వివరాలను ప్రకటిస్తానన్న ప్రవీణ్

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు గత మూడునాలుగు రోజులుగా రాష్ట్రంలో మారుమోగుతోంది. కారణం ఐ పి ఎస్ అధికారి అయిన ఆయన రాష్ట్రంలో కీలక ముద్రవేశారు. ప్రత్యేకించి గురుకుల పాఠశాలల రూపురేఖలను మార్చారు. గతంలో అనేక మంది అధికారులు గురుకుల పాఠశాలలకు కార్యదర్శులుగా పని చేసినప్పటికీ ప్రవీణ్ కుమార్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒక్క అవినీతి లేకుండా చేయగలిగారు. గురుకులాల్లో చేరేందుకు బడుగుబలహీన వర్గాలను ప్రోత్సహించారు . విద్యార్థులు , ఉపాధ్యాయుల మన్ననలను చూరగొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఠాకూర్ సినిమా లో లాగా ఇప్పుడు ఆయన ఒక సైన్యాన్ని తయారు చేశారు. ఆయనకు ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ తన ప్రభుత్వ పదవికి రాజీనామా చేయడం పై ఒక సంచలనంగా మారింది. ….
ఆయనపై రకరకాల పుకార్లు వచ్చాయి. హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన చేత సీఎం కేసీఆర్ రాజీనామా చేయించారని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. వాటన్నింటిని ఆయన కొట్టి పారేశారు. తనకు ఒక లక్ష్యం ఉందని దానికోసమే తాను స్వచ్చంద పదవి విరమణ చేసినట్లు వివరించి తనపై వస్తున్నా పుకార్లకు తెరదించారు…..

విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి హిందూ దేవతలను అవమానించారన్న అభియోగాలపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కరీంనగర్‌లో కేసు నమోదైంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో హిందూ దేవతలను కించపరిచేలా విద్యార్థులతో ప్రవీణ్ ప్రతిజ్ఞ చేయించారంటూ మార్చి 16న న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా కరీంనగర్ మూడో పట్టణ పోలీసులపై కేసు నమోదైంది. కరీంనగర్ మున్సిఫ్ న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైంది.

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రవీణ్ కుమార్ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. గురుకుల బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్‌ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్‌ను గురుకులాల కార్యదర్శిగా నియమించింది.

స్వేరోస్ ఆదిలాబాద్ జిల్లా నాయకుడు ఊషన్న గృహప్రవేశానికి నిన్న హాజరైన ప్రవీణ్ కుమార్ ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా దేవతను సందర్శించుకున్నారు. అక్కడి నుంచి ఊట్నూరు మండలంలోని లింగోజీ తండా చేరుకుని మాజీ ఐఏఎఎస్ అధికారి తుకారం విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అలాగే, దంతనపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ప్రవీణ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. తాను ఏ రాజకీయ పార్టీకి అమ్ముడుపోనన్నారు.

ఐపీఎస్ ఉద్యోగానికి వీఆర్ఎస్ ప్రకటించిన ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని, అయితే రాజకీయాలతోనే వ్యవస్థ మొత్తం మారిపోతుందని చెప్పడం సరికాదని అన్నారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే రోజుల్లో పూర్తి వివరాలను ప్రకటిస్తానని చెప్పారు. ఆదిలాబాద్ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని అన్నారు.

మరోవైపు ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రాబోతున్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితోనే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారని కొందరు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆయన పూర్తిగా వ్యతిరేకమని… అందువల్ల బీజేపీలో చేరే అవకాశాలు ఏమాత్రం లేవని మరికొందరు అంటున్నారు. సొంతంగా పార్టీని స్థాపించే అవకాశం ఉందని కొందరు, బీఎస్పీలో చేరే అవకాశం ఉందని మరికొందరు చెపుతున్నారు. ఆయన మాత్రం    ఇప్పటికైతే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు….

Related posts

అందుకే రోహిత్ శ‌ర్మ బాగా ఆడ‌లేదు: టీమిండియా ఘోర ఓట‌మిపై సునీల్ గ‌వాస్క‌ర్ వ్యాఖ్య‌లు

Drukpadam

తడిసి ముద్దైన తెలంగాణ …గోదావరికి వరద ప్రవాహం !

Drukpadam

‘వైఫ్’ అంటే ఏంటో చెప్పిన కేరళ హైకోర్టు!

Drukpadam

Leave a Comment