Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పదవిలో కొనసాగే నైతిక అర్హత అమిత్ షాకు లేదు…కాంగ్రెస్

పదవిలో కొనసాగే నైతిక అర్హత అమిత్ షాకు లేదు

-ఆ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాల కూల్చివేత వెనకా కేంద్రం: కాంగ్రెస్
-‘ది వైర్’ కథనం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతల విలేకరుల సమావేశం
-మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది
-పెగాసస్‌పై చర్చకు మోదీ అందుకే అంగీకరించడం లేదు

పెగాసస్ వ్యవహారంలో కేంద్రం చర్యలపై కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది . “ది వైర్ ” కథనం నేపథ్యంలో ప్రతిపక్షనాయకులకు చెందిన ఫోన్ల టాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసిందని ప్రతిపక్షాలు పార్లమెంట్ ను స్తంభింప చేశాయి. దీనిపై సీరియస్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు న్యూ ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి దీనికి హోమ్ మంత్రి అమిత్ షా నైతిక భాద్యత వహించి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసింది.

2019లో కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం వెనక కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందన్న ‘ది వైర్’ కథనం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు నిన్న ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

పెగాసస్ సాయంతో కర్ణాటకలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని కేంద్రం కూలదోసిందన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.

కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోసినందువల్లే ఈ వ్యవహారంపై చర్చకు ప్రధాని అంగీకరించడం లేదని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవాలోని ప్రభుత్వాలు కూలిపోవడం వెనక కూడా కేంద్రం హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై రెండు రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజనాథ్ సింగ్ , ప్రహ్లదు జోషి , లు ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు .

Related posts

షర్మిల ఖమ్మం సభ ఓకే … బట్ కండీషన్స్ అప్లై పోలిసుల మెలిక

Drukpadam

రక్తం మరుగుతోంది ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభలో కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్!

Drukpadam

జమిలి ఎన్నికలు చట్ట సవరణ లేకుండా సాధ్యమా ?

Drukpadam

Leave a Comment