Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్ లో మారుతున్న రాజకీయం.. 62 మంది ఎమ్మెల్యేలతో సిద్ధూ సమావేశం!

పంజాబ్ లో మారుతున్న రాజకీయం.. 62 మంది ఎమ్మెల్యేలతో సిద్ధూ సమావేశం!
-ట్విట్టర్ లో వెల్లడించిన పంజాబ్ పీసీసీ చీఫ్
-అమృత్ సర్ లోని తన నివాసంలో భేటీ
-ప్రాధాన్యం సంతరించుకున్న వ్యాఖ్యలు

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన కొన్ని రోజులకే పార్టీ ఎమ్మెల్యేలతో నవ్ జోత్ సింగ్ సిద్ధూ సమావేశమయ్యారు. ఇవాళ అమృత్ సర్ లోని తన నివాసంలో 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ సమావేశాన్ని ఆయన ‘గాలి మార్పు’ అంటూ అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రజల కోసం.. ప్రజల చేత.. ప్రజల యొక్క’ అంటూ ట్వీట్ చేశారు.

పీసీసీ చీఫ్ గా సిద్ధూను నియమిస్తున్నట్టు ఆదివారం కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు సన్నిహిత నేతలతో సిద్ధూ సమావేశమయ్యారు. వాస్తవానికి చాలా రోజులుగా కెప్టెన్ అమరీందర్ కు, సిద్ధూకు అస్సలు పడడం లేదు. సీఎం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సిద్ధూ వ్యతిరేకిస్తూ వచ్చారు. వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకోవడం దగ్గర్నుంచి.. మొన్నటి కరెంట్ కోతల వరకు సీఎంపై సిద్ధూ విమర్శనాస్త్రాలు సంధించారు. సిద్దు నియామకాన్ని సీఎం అమరిందర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ అయన మాటను పక్కన పెట్టిన అధిష్టానం సిద్దనే పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించింది. నియామకం అనంతరం సిద్దు సీఎం అమరిందర్ సింగ్ ను కలిసే ప్రయత్నం చేసిన ఆయన ససేమీరా అన్నారు.

ఇరువురి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలను అధిష్టానం చేసింది . పార్టీ రాష్ట్ర వ్యహారాలు ఇంచార్జి హరీష్ రావత్ కాంగ్రెస్ లో సయోధ్య కోసం పంజాబ్ లో పర్యటించారు. కెప్టెన్ అమరిందర్ సింగ్ తో సమావేశమైయ్యారు. అయినప్పటికీ క్యాప్టిన్ సిద్దు తనపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టు బట్టారు. సిద్దు ను కలిసేందుకు ససేమీరా అన్నారు. క్యాప్టిన్ అలిగినప్పటికీ సిద్దు తనపని తాను చేసుకు పోతున్నారు….. పంజాబ్ లో ఏమి జరుగుతుందో చూడాల్సిందే మరి !

Related posts

సంకల్ప సభకు తల్లి విజయమ్మతో పాటు షర్మిల గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం

Drukpadam

ఢిల్లీలో మమత బిజీబిజీ.. నేడు మోదీతో భేటీ!

Drukpadam

కాంగ్రెస్ పార్టీకి ధైర్యవంతులు కావాలి పిరికి వాళ్ళు కాదు ….రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్!

Drukpadam

Leave a Comment