Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కొత్త వ్యవసాయ చట్టాలను, కార్మిక కోడ్ లను, విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలి . …….

కొత్త వ్యవసాయ చట్టాలను, కార్మిక కోడ్ లను, విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలి .
-జులై 25నుండి ఆగష్టు 9 వరకు “సేవ్ ఇండియా” ప్రచార క్యాంపెయిన్
-జయప్రదం చేయండి సీటు ,ఏ ఐ కె ఎస్ ,ఏ ఐ డబ్ల్యూ ల పిలుపు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక కోడ్ లను రద్దు చేయాలని, పెరిగిన ధరలు అరికట్టాలని ప్ర* భుత్వ రంగ సంస్థల పరిరక్షించాలని కోరుతూ సిఐ టియు ,AIKS,AIAWU సంఘాల ఆధ్వర్యంలో జూలై 25 నుండి ఆగస్టు 9 (క్విట్ ఇండియా) వరకు గ్రామస్థాయిలో లో విస్తృత ప్రచారం చేయాలని ఆగస్టు 9న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని మూడు సంఘాల జిల్లా కమిటీ సభ్యుల సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది. సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ సమరశీలంగా రైతులు పోరాటం కొనసాగుతున్నదని లక్షలాది మంది రైతులు డిల్లీ సరిహద్దులలో పోరాడుతున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పట్టుదలతో పోరాడుతున్న రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, నియంత్రత్వం వల్ల సుమారు 600 మందికి పైగా చనిపోయారు. రైతు సంఘాలు,కార్మికసంఘాలు ,ప్రతిపక్షాలు,మేధావులు,ప్రజాస్వామికశక్తులు,అందరుఆందోళనలుచేస్తూచట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. అయిన మోడి ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం లేదు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను, విద్యుత్ సవరణబిల్లు 2020 ను తీసుకువచ్చి కార్మిక, ప్రజల హక్కులను హరించి యాజమానులకు యధేచ్చగా దోపిడి చేసుకోడానికి
అవకాశం కల్పించింది. ఈ చట్టాలన్నింటిని బేషరుతుగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులు,రైతులు నరేంద్ర మోడి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భుజం కలిపి పోరాడాలని వారు పిలుపునిచ్చారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించింది. నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టానికి సవరణ చేసింది. కార్పొరేట్
మరియు కాంట్రాక్ట్ వ్యవసాయానికి తెరతీసింది. ఆహార ప్రాసెసింగ్ ను దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుంది.ఈ చర్యలవల్ల దేశ
ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. విద్యుత్ (సవరణ) 2020 బిల్లును పార్లమెంట్ లోప్రవేశపెట్టకుండానే, విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణను *ప్రారంభించింది. విద్యుత్ బిల్లు వల్ల ప్రస్తుతం వున్న వినియోగ
దారులకు వున్న స్లాబ్ రేట్లను ఎత్తివేస్తారు. గృహా వినియోగ దారులకు కూడా కమర్షియల్ విద్యుత్ చార్జీలు చెల్లించాల్సివస్తున్నదని పేదలకు విద్యుత్ చార్జీలు పెరుగుతాయని.పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు, పారిశ్రామిక సంస్థలు, సంపన్న వర్గాలు, పేదలు ఒకేతరహా విద్యుత్ చార్జీలు
చెల్లించాల్సి వస్తుందని ఇది కార్మిక, రైతు, సామాన్య ప్రజలకు నష్టం. విద్యుత్ రంగం ప్రైవేటీకరణ అవుతుందని వారు తెలిపారు .ఎఐకెఎస్ సిసి ఒక నమూనా చట్టాన్ని కూడా తయారుచేసి బిజెపి ప్రభుత్వానికి ఇచ్చిందని , దాన్నికేంద్రం చెత్తబుట్టలో
వేసింది ధ్వజమెత్తారు . కేరళ తరహా రైతు రుణవిమోచన చట్టాన్ని దేశమంత వర్తింప చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు ,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరావు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్,వివిధ ప్రజాసంఘాల జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, బొంతు రాంబాబు, తుమ్మ విష్ణువర్ధన్, నాయకులు ఎర్ర శ్రీకాంత్ ,తాతా భాస్కరరావు ,సంగయ్య , జానకి రాములు, శీలంనరసింహారావు,తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాలిఫోర్నియా అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం…

Drukpadam

తిరుపతి గంగమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు.. ఇక నుంచి రాష్ట్ర పండుగ!

Drukpadam

వైద్య ,వ్యవసాయ రంగాలపై కేంద్ర కెబినెట్ కీలక నిర్ణయాలు!

Drukpadam

Leave a Comment