Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెగాసస్ పై కాంగ్రెస్ ఛలో రాజభవన్ ఉద్రిక్తత …భట్టి, జగ్గారెడ్డి, సీతక్క అరెస్ట్…

పెగాసస్ పై కాంగ్రెస్ ఛలో రాజభవన్ ఉద్రిక్తత …భట్టి, జగ్గారెడ్డి, సీతక్క అరెస్ట్
కాంగ్రెస్ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
పెగాసస్ వ్యవహారంపై నిరసనలు
హైదరాబాదులో ఛలో రాజ్ భవన్ చేపట్టిన కాంగ్రెస్
ఇందిరాపార్క్ వద్ద నిరసన సభ
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో, హైదరాబాదులో రాజ్ భవన్ దిశగా ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క తదితర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇందిరాపార్క్ వద్ద జరిగిన సభలో సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ ఎన్నో వేళ్ళ క్రితం పోరాడి సాధించుకున్న స్వతంత్రాన్ని మోడీ ప్రభుత్వం కలరిస్తుందని విమర్శించారు . బీజేపీ చేస్తున్న ఆగడాలు చూడలేక ప్రజాస్వామ్య వాదులు ఆందోళన చెందుతున్నారు..స్వేఛ్ఛ కోసం ఈ దేశంలో పోరాడాల్సి వస్తుందని కేంద్రం చర్యలను తూర్పారబట్టారు . మనం స్వాతంత్య్రం తెచుకున్నదే ..స్వేచ్ఛ కోసం.. ఇప్పుడు ఆ స్వేచ్ఛ నే హరించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
స్వయంప్రతిపత్తి గల సంస్థలు , ప్రతిపక్ష పార్టీ ల ముఖ్య నేతల ఫోన్ లు ట్యాప్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ..

కెనెడా దేశంలోని టొరంటో యూనివర్సిటీకి చెందిన ముఖ్య సంస్థ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నిరూపించింది..టెర్రరిస్టుల సమాచారం తెలుకునేందుకు వాడే సాఫ్ట్వేర్ ను..ప్రతిపక్షాల పై న ఈ ప్రభుత్వం వాడుతుంది. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్ధం దీనికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నైతిక భాద్యత వహించి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు.

టెర్రరిస్టులను అంత మొందించాల్సింది పోయి..ప్రతి పక్షాల ను అంత మొందిస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం..ప్రతిపక్షాలు లేకుండా చేసి , నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది. ఈ దేశానికి స్వేచ్ఛ ను తీసుకువచ్చింది కాంగ్రెస్.. బీజేపీ ఆ స్వేచ్ఛ ను హరిస్తుంటే చూస్తూ ఊరుకోలేక అందుకే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాపిత నిరసనలకు పిలుపు నిచ్చిందని అన్నారు .ఈ ప్రభుత్వాన్ని సాగనంపినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుందని అన్నారు. ఈసందర్భంగా ఛలో రాజభవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని నాయకులను అరెస్ట్ చేయడాన్ని భట్టి ఖండించారు.

రేవంత్ రెడ్డి ఆగ్రహం …. అరెస్టుల కు ఖండన

దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. పెగాసస్ స్నూప్ గేట్ వివాదంపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

 

Related posts

మహిషాసురుడిగా ప్రధాని మోదీ.. దుర్గాదేవిగా మమతా బెనర్జీ.. పోస్టర్ పై రచ్చ!

Drukpadam

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అట్టహాసంగా భూమి పూజ చేసిన కేసీఆర్!

Drukpadam

“ప్లీజ్ న‌న్ను పాస్ చేయండి స‌ర్.. లేదంటే మా నాన్న పెళ్లి చేస్తాడు”.. బోర్డు ప‌రీక్ష‌ల్లో రాసిన విద్యార్థిని!

Drukpadam

Leave a Comment