Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెగాసస్’తో నిఘాపెట్టారని మేం చెప్పలేదంటున్న అమ్నెస్టీ…

పెగాసస్’తో నిఘాపెట్టారని మేం చెప్పలేదంటున్న అమ్నెస్టీ…
-పెగాసస్’ గూఢచర్యం వివాదంపై ‘ఆమ్నెస్టీ’ వివరణ
-ముప్పుందని మాత్రమే చెప్పామన్న అమ్నెస్టీ
-క్లయింట్లు ఆసక్తి చూపిస్తున్న నంబర్లనే చెప్పామని వెల్లడి
-ఆ ఫోన్లపై ఎలాంటి గూఢచర్యమూ జరగలేదని క్లారిటీ
-‘పెగాసస్​’పై ఫ్రాన్స్​ అత్యవసర సమావేశం
-అధికారులకు అధ్యక్షుడు మెక్రాన్ సమాచారం
-అంశాన్ని సీరియస్ గా తీసుకున్న మెక్రాన్
-ఆయన ఫోన్ పైనా దాడి జరిగినట్లు సమాచారం

పెగాసస్ వివాదం కీలక మలుపు తిరిగింది. కేంద్ర మంత్రులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద హక్కుల కార్యకర్తలతో పాటు ఇతర ప్రముఖుల ఫోన్లలోకి ‘పెగాసస్’ చొరబడిందని ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ అనే హక్కుల సంస్థ ఆ వివరాలను బయటపెట్టిందని ఆ మీడియా పేర్కొంది. దీనిపై రెండు రోజులుగా పార్లమెంట్ లో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ వివాదంపై ఆమ్నెస్టీ స్పందించింది. ఇటీవల వెల్లడించిన ఫోన్ నంబర్లను ఎన్.ఎస్.వో తయారు చేసిన పెగాసస్ టార్గెట్ చేసుకుందని తాము చెప్పలేదని స్పష్టం చేసింది. అవి కేవలం ఎన్.ఎస్.వో క్లయింట్లు ఆసక్తి చూపిస్తున్న నంబర్లు మాత్రమేనంటూ పేర్కొన్నామని స్పష్టం చేసింది. ‘‘లిస్ట్ లోని ఫోన్ నంబర్లపై ఎన్.ఎస్.వో క్లయింట్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మాత్రమే మేం చెప్పాం. అంటే నిఘా పెట్టే అవకాశాలున్నాయని మాత్రమే చెప్పాం తప్ప.. పెగాసస్ తో నిఘా పెట్టారని మేం చెప్పలేదు’’ అని సంస్థ క్లారిటీ ఇచ్చింది.

ఆ ఫోన్ నంబర్లపై ఇప్పటిదాకా ఎలాంటి గూఢచర్యమూ జరగలేదని తేల్చి చెప్పింది. అయితే, ఆ జాబితాలోని అతి కొద్ది మంది ఫోన్లపై మాత్రం నిఘా పెట్టి ఉండొచ్చని తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 50 వేల ఫోన్ నంబర్లకు పెగాసస్ ముప్పు పొంచి ఉందని ఆమ్నెస్టీ, ఫ్రాన్స్ కు చెందిన ఫర్ బిడెన్ స్టోరీస్ అనే సంస్థలు ఇటీవల వెల్లడించాయి. అందులో 300 మంది భారతీయులూ ఉన్నట్టు పేర్కొంది.

ఫ్రాన్స్ లోనూ పెగాసస్ నిఘా ఉందన్న కథనాల నేపథ్యంలో.. జాతీయ భద్రతపై ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సమీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులకు ఆయన ఇప్పటికే సమాచారం పంపించారు. ఈ అంశాన్ని మెక్రాన్ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని ప్రభుత్వ ప్రతినిధి గేబ్రియల్ అట్టాల్ చెప్పారు. దేశంలో సైబర్ భద్రతపై ఇది అత్యవసర సమావేశమని అన్నారు.

కాగా, మెక్రాన్ ఫోన్ నంబర్లలో ఒకటి పెగాసస్ దాడికి గురైందని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఆయన మంత్రిమండలిలోని కొందరు మంత్రుల వివరాలూ లీకయ్యాయి. మాజీ పర్యావరణ మంత్రి, మెక్రాన్ కు అత్యంత సన్నిహితుడైన ఫ్రాన్ష్ వా డి రూగీ ఫోన్ పై దాడి జరిగినట్టు సైబర్ వర్గాల విశ్లేషణలో తేలింది.

భారత్ లోనూ పెగాసస్ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు వెయ్యి మంది ఫోన్లు హ్యాక్ అయినట్టు ఆమ్నెస్టీ ద్వారా తెలుస్తోంది. అందులో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, స్వచ్ఛంద కార్యకర్తలున్నారు.

Related posts

ప‌నిచేసే వారికే పార్టీ టికెట్లు… కాంగ్రెస్ నేత‌ల‌కు తేల్చిచెప్పిన రాహుల్!

Drukpadam

రాములు నాయక్ కు వైరా సీటు ఖాయమేనా …?

Drukpadam

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి…సీఎల్పీ నేత భట్టి డిమాండ్

Drukpadam

Leave a Comment