Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు…

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు
పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన సర్కార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో పొంగిపొర్లుతున్న కిన్నెరసాని
బొగ్గు గనుల్లో చేరిన నీరు … నిలిచిపోయిన ఉత్పత్తి
అనేక చోట్లా పొంగుతున్న వాగులు -రాకపోకలకు అంతరాయం

 

తెలంగాణ వ్యాపితంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తం అయింది. ప్రధానంగా ,ఖమ్మం , వరంగల్ , కరీంనగర్ , ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు ప్రజలాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నారు. దీంతో ఈ జిల్లాలలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. గోదావరి కి భారీ వరద చేరడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరు బయటకు రావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్నప్తి చేశారు.

రాగల 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.దే సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా హైదరాబాద్ లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ :ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని డ్యాం లోకి చేరుతున్న వరద నీరు…కిన్నెరసాని డ్యామ్ రెండు గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు… పాల్వంచ బూర్గంపాడు మండల కిన్నెరసాని నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వాగులు, వంకలు ప్రవహిస్తూ, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది…దీంతో సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువుకు ఒక అడుగు మేర అలుగు పడింది..సత్తుపల్లి JVR ఉపరితల బొగ్గు గనుల్లో 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది…అలాగే, సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్ళే జాతీయ రహదారిపై రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి…వరద తాకిడికి రోడ్డు కొట్టుకుపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది…ఇలానే కొనసాగితే చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

 

స్నానాల లక్ష్మీపురం- కేజీ సిరిపురం గ్రామాల మధ్య రాకపోకలు బంద్. వాహనదారులకు విజ్ఞప్తి. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం తో నిండి అలుగులు పారడం తో స్నానాల లక్ష్మీపురం లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్న చెప్ట పై నుండి వైరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లక్ష్మీపురం సిరిపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కావున వాహనదారులు అందరూ గమనించగలరు మల్లురామకృష్ణ ఉప సర్పంచ్ స్నానాల లక్ష్మీపురం

ఖమ్మం నుండి సత్తుపల్లి వాహనాలు తిరగటం లేదు లంకపల్లి దగ్గర రోడ్ తెగిపోయింది..
పల్లెవాడ మీదుగా దారి మల్లింపు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఏసీపీ వెంకటేష్ తో కలిసి కల్లూరు వద్ద పొంగుతున్న వాగులను పరిశీలించారు.

 

ఖమ్మం లో మున్నేరు కు భారీవరదలు రావడంతో పరివాహక ప్రాంతాల వాసులను కార్పొరేషన్ అధికారులు అలర్ట్ చేశారు. మేయర్ పూనుకొల్లు నీరజ మున్నేరు వరద ఉదృతిని పరిశీలించారు.

సైడ్ కాల్వలు లేక కురిసిన వర్షానికి ఇంటి ప్రాంగణంలో 3 ఫీట్ల నీళ్లు నిల్వ ఉండి ఇబ్బందులు పడుతున్న దానవాయిగూడెం ప్రాంతవాసులు

ఖమ్మం  నగరానికి కూతవేటు దూరంలో ఉన్న 59వ డివిజన్ దానవాయిగూడెం ప్రాంతంలో రోడ్ నెంబర్ 6,7,8,9 లో రోడ్డుకు ఇరువైపులా సైడ్ కాల్వలు లేక వర్షాలు పడినప్పుడల్లా ఇంటి ముందు వర్షపు నీరు నిల్వ ఉంది పనులకు బయటికి వెళ్లాలంటే చెరువుల తలపించేలా ఉందని మోకాళ్ల లోతు నీరును దాటుకుంటూ బయటికి రావాల్సిన దుష్ట పరిస్థితి ఏర్పడిందని నగరం చుట్టుపక్కల మారుమూల ప్రాంతాల అభివృద్ధి చెందుతున్న 59వ డివిజన్ లో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందలేదని రోడ్లు కూడా సరిగా లేవని ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు . రోజువారి కూలి పనులను చేసుకునే వారు , ఉద్యోగస్తులు , వ్యాపారస్తులు ఉన్నారని కావున సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు , ప్రజాప్రతినిధులు , స్థానిక కార్పోరేటర్ ఆ ప్రాంతాలను పర్యవేక్షించి సమస్యలు పరిష్కరించాలని కోరారు .

Related posts

ఆసక్తిక‌ర స‌న్నివేశం!.. బాలినేని వెంట జ‌గ‌న్ వ‌ద్ద‌కు క‌ర‌ణం బ‌ల‌రాం!

Drukpadam

ఆరేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యా: పథనంథిట్ట కలెక్టర్ దివ్య

Drukpadam

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ పై కాల్పులు …ఖండించిన మాజీ భార్యలు

Drukpadam

Leave a Comment