Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విజయవాడ లో జరిగిన సమావేశంలో సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన ఎమ్మెల్యే లు!

విజయవాడ లో జరిగిన  సమావేశంలో సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన ఎమ్మెల్యే లు
-దేశంలో నాలుగు భాషలు మాట్లాడగలిగే సీఎం జగన్ ఒక్కరే!: నూజివీడు ఎమ్మెల్యే వెంకటప్రతాప్
-గృహ నిర్మాణశాఖ సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
-30 ఏళ్లపాటు ఏపీని జగనే పాలిస్తారన్న జోగి రమేశ్
-తమ నియోజకవర్గంలోని సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు

ఏపీ లో మరికొన్ని రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ జరగబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోనో ఏమోగానికి ముఖ్యమంత్రి జగన్ ను ఎమ్మెల్యేలు పొగడలతలతో ముంచెత్తుతున్నారు. నిన్న విజయవాడలో జరిగిన గ్రహనిర్మాణ సమీక్షాసమావేశంలో ఎమ్మెల్యేలలో ఒక పక్క తమ అసంతృప్తిని సుతిమెత్తగా ఎత్తుచూపుతునే ముఖ్యమంత్రిపై ప్రసంశలు కురిపించారు. ఒక ఎమ్మెల్యే దేశంలోనే జగన్ లాంటి సీఎం లేడని అంటే మరి ఎమ్మెల్యే దేశంలో నాలుగు భాషలు వచ్చిన సీఎం జగన్ ఒక్కరే అని పొగడ్తలు కురిపించారు. మరో 30 సంవత్సరాలవరకు ఆయనే సీఎం అంటూ మరో ఎమ్మెల్యే కితాబు నిచ్చారు . అంతే కాకుండా దేశానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఆయనకే ఉన్నాయని బట్రాజు పొగడ్తలు పొగిడారనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమావేశంలో ఎమ్మెల్యేలు సుతిమెత్తగా తమను పట్టించుకోక పోవడాన్ని ఎట్టి చూపారు .

దేశంలో నాలుగు భాషలు మాట్లాడగలిగే ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని, ఆయన ప్రధానిగా ఎదుగుతారని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు జోస్యం చెప్పారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ మరో 30 ఏళ్లపాటు జగనే ఈ రాష్ట్రాన్ని పాలిస్తారని అన్నారు. విజయవాడలో నిన్న జరిగిన గృహ నిర్మాణాల సమీక్షలో వీరు మాట్లాడుతూ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

సమీక్షలో జోగి రమేశ్ మాట్లాడుతూ.. జియో ట్యాగింగ్‌లో కాలయాపన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నూజివీడు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి అదనపు రుణాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచాలని కోరారు. ఇసుక రవాణా లారీలను అడ్డుకుంటున్న పోలీసులు కేసులు రాస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ అన్నారు.

విజయవాడకు చెందిన లబ్ధిదారుల కోసం మైలవరం నియోజకవర్గంలో భూములు కొనుగోలు చేసిన విషయాన్ని అధికారులు తనకు చెప్పనేలేదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మరోపక్క తాను టీడీపీ నేత దేవినేని ఉమతో ప్రతిరోజూ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. అలాగే, తమ తమ నియోజకవర్గాలలోని పలు సమస్యల గురించి ఇతర ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.

Related posts

నాడు కమీషన్ల కోసం కక్కుర్తి పడిన కేసీఆర్ ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు: బండి సంజయ్

Drukpadam

పార్టీ విరాళాల సేకరణలో టాప్ లో ఉన్న టీఆర్ యస్ ,టీడీపీ ,వైసీపీ!

Drukpadam

హరీశ్, ఈటల మధ్య చిచ్చు పెడుతున్న కేసీఆర్ : ముదిరాజ్ నేత ధ్వజం…

Drukpadam

Leave a Comment