వివేకా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొలిక్కిరాని కేసు …

వివేకా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొలిక్కిరాని కేసు …
వివేకా కేసు దర్యాప్తులో ప‌ర్య‌వేక్ష‌ణ అధికారి మార్పు
ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ప‌ర్య‌వేక్ష‌ణ అధికారిగా డీఐజీ సుధాసింగ్‌
ఎస్పీ రామ్‌కుమార్‌కు బదిలీ
44 రోజులుగా కొనసాగిన ద‌ర్యాప్తు
వివేకా హత్య కేసులో వాచ్ మన్ రంగన్న వాంగ్మూలం నమోదు
2019లో వైఎస్ వివేకా హత్య ,ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న మర్డర్ కేసు
సీబీఐ దర్యాప్తు వేగవంతం… త్వరలో కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం

మాజీమంత్రి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇప్పటికి రెండు సంవత్సరాలు దాటింది. అప్పటి టీడీపీ గాని ఇప్పుడు ఉన్న జగన్ సర్కార్ గాని కేసును ఛేదించలేక పోయాయి. ఒకరిపై ఒకరు నిందలు పాముకోవడంతోనే సరిపోయింది. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ కూడా ఇదిగో అదిగో అంటూ విచారణ కొనసాగిస్తుంది.

ఈ కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచార‌ణ కొనసాగిస్తోన్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజులుగా అక్క‌డే సీబీఐ అధికారులు అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఈ కేసులో మ‌రిన్ని వివ‌రాల‌ను రాబ‌ట్టేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే, తాజాగా ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. పర్యవేక్షణ అధికారిని మార్చి వేస్తూ సీబీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ కేసు డీఐజీ సుధాసింగ్‌ నుంచి ఎస్పీ రామ్‌కుమార్‌కు బదిలీ అయింది. ఈ కేసులో 44 రోజులుగా ద‌ర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు పర్యవేక్షణ అధికారిని మార్చ‌డం చర్చనీయాంశం అవుతోంది.

 

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ జమ్మలమడుగు న్యాయస్థానంలో జడ్జి ఎదుట వాచ్ మన్ రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. రంగన్న ఈ కేసుకు సంబంధించి ఎంతో కీలక సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది.

కాగా, గత నెలన్నర రోజులుగా కడప జిల్లాలోనే మకాం వేసిన సీబీఐ అధికారులు ప్రతిరోజూ కొందరు అనుమానితులను ప్రశ్నిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరుగురిపైనే సీబీఐ దృష్టి సారించినట్టు అర్థమవుతోంది. వారిలో వివేకా ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి, పీఏ కృష్ణారెడ్డి, వాచ్ మన్ రంగన్న, పులివెందులకు చెందిన కృష్ణయ్య కుటుంబం, ఇనాయతుల్లాలను సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు.

Leave a Reply

%d bloggers like this: