ఏపీలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎస్‌ఈసీ రెడీ.. నోటిఫికేషన్ జారీ!

ఏపీలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎస్‌ఈసీ రెడీ.. నోటిఫికేషన్ జారీ
-రాష్ట్రంలోని 11 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో ఎన్నిక
-30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశం
-అదే రోజున ఏలూరులో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు

ఏపీలో రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌పర్సన్లను నియమించాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై ఎస్ఈసీ స్పందించింది. రాష్ట్రంలోని 11 మునిసిపల్ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలలో రెండో వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి ఎన్నిక కోసం ఈ నెల 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

30న నిర్వహించనున్న సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఎన్నికైన సభ్యులు, ఎక్స్‌ అఫీషియో సభ్యులను కోరారు. అలాగే, ఏలూరు కార్పొరేషన్‌లోనూ ఈ నెల 30నే మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ పేర్కొంది.

Leave a Reply

%d bloggers like this: