తెలంగాణ‌లోనూ ఫోన్ ట్యాపింగులు: కోదండ‌రామ్ ఆరోపణలు!

తెలంగాణ‌లోనూ ఫోన్ ట్యాపింగులు: కోదండ‌రామ్ ఆరోపణలు
-మానవ హక్కుల నేతలు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్‌
-ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడే వారిపై కుట్ర‌
-గోప్యతా హక్కుకు భంగం క‌లిగించేలా చ‌ర్య‌లు
-అంద‌రూ క‌లిసి పోరాడాలి

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇజ్రాయెల్ కు చెందిన‌ స్పైవేర్‌ ‘పెగాసస్‌’ సాయంతో కేంద్ర ప్ర‌భుత్వం భార‌త్ లోని ప‌లువురు ప్ర‌తిప‌క్ష‌ నేత‌లు, జర్నలిస్టుల ఫోన్లపై నిఘా ఉంచినట్లు వ‌స్తోన్న క‌థ‌నాలు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కోదండ‌రామ్ స్పందిస్తూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు.

మానవ హక్కుల నేతలతో పాటు ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులపై పెగాసస్‌ను వాడుతున్నార‌ని కోదండ‌రామ్ ఆరోప‌ణ‌లు గుప్పించారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడే వారి గోప్యతా హక్కుకు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వం పాల్ప‌డుతోన్న ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా అంద‌రూ క‌లిసి పోరాడాల‌ని ఆయ‌న అన్నారు.

Leave a Reply

%d bloggers like this: