ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాటలో మరికొందరు.. రాజీనామాకు రెడీ అయిన డీఎస్పీ విష్ణుమూర్తి!

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాటలో మరికొందరు.. రాజీనామాకు రెడీ అయిన డీఎస్పీ విష్ణుమూర్తి
-పోలీసు శాఖలో దళిత అధికారులను వేధిస్తున్నారని మనస్తాపం
-డీజీపీని కలిసి రేపు రాజీనామా సమర్పించే అవకాశం
-హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ప్రచారం

ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాటలో మరికొందరు పోలీసు అధికారులు నడవనున్నట్టు తెలుస్తోంది. పోలీసు శాఖలో దళిత అధికారులను వేధిస్తున్నారని మనస్తాపంతో ఉన్న డీఎస్పీ విష్ణుమూర్తి ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి రేపు (సోమవారం) తన రాజీనామా లేఖను అందించనున్నట్టు సమాచారం. త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీఎస్పీ తరపున ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

కాగా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పార్టీల్లో చేరకుండా ఆయన ఓ పార్టీని స్థాపించే యోచనలో ఉన్నట్టు సమాచారం. హుజూరాబాద్ ఎన్నికల్లో ఆయన పోటీలోకి దిగుతారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు.

Leave a Reply

%d bloggers like this: