బీహార్‌లో దారుణం: యువకుడి మర్మాంగం కోసి దారుణహత్య..

బీహార్‌లో దారుణం: యువకుడి మర్మాంగం కోసి దారుణహత్య..
ప్రేమ వ్యవహారమే కారణం… ముజఫర్‌పూర్‌లో ఘటన
కుమార్తెను ప్రేమించినందుకు కుటుంబ సభ్యుల ఘాతుకం
నిందితుల ఇంటి వద్దే యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన జరిగింది. తమ కుమార్తెను ప్రేమించాడన్న కోపంతో ఓ యువకుడిని పట్టుకుని చిత్రహింసలు పెట్టిన యువతి కుటుంబ సభ్యులు.. ఆపై అతడి మర్మాంగాన్ని తెగ్గోశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..

ముజఫర్‌పూర్ జిల్లా రేపురా రామ్‌పుర్షా గ్రామానికి చెందిన 19 ఏళ్ల సౌరభ్‌రాజ్.. సోర్బారా గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి సౌరభ్‌ను తమ ఇంటికి పిలిపించారు. అతడు రాగానే దాడిచేసి మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టారు. అనంతరం ఓ ఆసుపత్రిలో చేర్చి పరారయ్యారు.అక్కడ చికిత్స పొందుతూ సౌరభ్ మృతి చెందాడు.

విషయం తెలిసిన బాధిత యువకుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. నిందితుల ఇంటిపై దాడిచేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి నిందితుల ఇంటి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసులో కీలక నిందితుడైన సుశాంత్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, నిందితుడి ఇంటిపై దాడిచేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: