ఏలూరు మునిసిపల్ ఎన్నికలు.. మృతి చెందిన అభ్యర్థుల గెలుపు!

ఏలూరు మునిసిపల్ ఎన్నికలు.. మృతి చెందిన అభ్యర్థుల గెలుపు
మార్చిలో ఎన్నికలు.. నిన్న విడుదలైన ఫలితాలు
కరోనా బారినపడి మృతి చెందిన ఇద్దరు అభ్యర్థులు
ఈ నెల 30న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

కొన్ని సార్లు న్యాయం ఆలశ్యం అయితే భాదితులు తమకు తాము సర్దుకుని బయటరాజీమార్గం ద్వారా కేసు పరిష్కరించుకుంటారు. ప్రధానంగా అనేక సివిల్ డిస్ప్యూట్ తగాదాలు ఆవిధంగానే పరిస్కారం అవుతాయికూడా కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లల్లో గెలుపొందిన అభ్యర్థులు ఇరువురు చనిపోయారు. గత మార్చ్ లో ఎన్నికలు జరిగిన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులలో ఇరువురు కరోనా మహమ్మారి కారణంగా చనిపోయారు. వారు మార్చు లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. అనివార్యకారణాలవల్ల కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ విషయంలో కోర్ట్ కొన్ని కారణాల వలన స్టే విధించింది. దానితో ఎన్నికల లెక్కింపు జరపకుండానే గత నాలుగు నెలలుగా నిలిచి పోయింది. కోర్టు లెక్కింపుకు పచ్చ జెండా ఊపటం తో జులై 25 ఆంటే నిన్న లెక్కించారు. ఎన్నికల్లో పోటీచేసి చనిపోయిన ఇద్దరు గెలుపొందారు. వారు గెలిచినట్లు ప్రకటించినప్పటికీ వారు లేనికరంగా ఆ డివిజన్లలో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో మృతి చెందిన ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగ్గా కోర్టు కేసుల కారణంగా లెక్కింపు వాయిదా పడింది. తాజాగా హైకోర్టు తీర్పుతో నిన్న లెక్కింపు ప్రారంభం కాగా, వైసీపీ ఘన విజయం సాధించింది.

ఇదిలావుంచితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు రెండు నెలల క్రితం కరోనా బారినపడి మృతి చెందారు. వీరిలో 45వ డివిజన్ నుంచి పోటీ చేసిన బేతపూడి ప్రతాపచంద్ర ముఖర్జీ 1058 ఓట్లతో, 46 డివిజన్ నుంచి పోటీ చేసిన ప్యారీ బేగం 1232 ఓట్లతో విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో 47 డివిజన్లలో విజయం సాధించిన వైసీపీ నగర పీఠాన్ని దక్కించుకుంది. ఈ నెల 30న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.

Leave a Reply

%d bloggers like this: