మోదీకి దమ్ముంటే యడియూరప్పపై విచారణ జరిపించాలి: సిద్ధరామయ్య!

మోదీకి దమ్ముంటే యడియూరప్పపై విచారణ జరిపించాలి: సిద్ధరామయ్య
-యడియూరప్ప అవినీతికి పాల్పడిన వ్యక్తి
-తినను, తిననివ్వను అని మోదీ ప్రమాణం చేశారు
-ప్రమాణాన్ని నిలబెట్టుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది

కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒక పక్క బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు యడియూరప్ప రాజీనామా చేయాగా ,మాజీముఖ్యమంత్రి ,ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్దరామయ్య యడియూరప్ప చేసిన అవినీతిపై విచారణ జరిపించాలని సవాల్ చేశారు. మోడీకి యడియూరప్పపై విచారణ చేసే దమ్ముందా ? అని ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. మోడీ ప్రధానిగా ప్రమాణం చేసనిన సందర్భంగా తాను తినను ,ఇతరులను తిననివ్వను అని చెప్పారని దానికి కట్టు బడి ఆయన ఉన్నట్లయితే వెంటనే యడ్డిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. యడియూరప్ప అంతులేని అవినీతికి పాల్పడిన వ్యక్తి అని ఆరోపించారు. ‘న ఖావూంగా, న ఖానేదూంగా’ (తినను, తిననివ్వను) అని మోదీ చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పుడు అవకాశం వచ్చిందని అన్నారు. మోదీకి దమ్ముంటే యడియూరప్ప అవినీతిపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో మోదీ, బీజేపీ, యడియూరప్పలపై ఆయన మండిపడ్డారు.

Leave a Reply

%d bloggers like this: