బీజేపీకి పెద్దిరెడ్డి గుడ్ బై …టీఆర్ యస్ నా ? కాంగ్రెస్ లోకా ??

బీజేపీకి పెద్దిరెడ్డి గుడ్ బై …టీఆర్ యస్ నా ? కాంగ్రెస్ లోకా ??
ఈటల చేరిన తర్వాత బీజేపీలో మారిన పరిణామాలు
పెద్దిరెడ్డి అసంతృప్తి.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా
బండి సంజయ్ కి రాజీనామా లేఖ పంపిన వైనం

ముందు నుంచి అనుకున్నట్లు గానే మాజీమంత్రి ,బీజేపీ నాయకుడు ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పెద్దిరెడ్డి ఈటల బీజేపీ లో చేరడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఆయన తెలుగు దేశం నుంచి హుజురాబాద్ కు ఎమ్మెల్యే గా ఎన్నికైయ్యారు. రాష్ట్రంలో తెలుగుదేశం బలహీనపడుతున్న వేళ అనేకమంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తమ రాజకీయభవిష్త కోసం వివిధ పార్టీలలో చేరారు. ఇప్పుడు టీఆర్ యస్ లో ఉన్న అనేకమంది నేతలు తెలుగుదేశం నుంచి వచ్చినవారే కావడం గమనార్హం . ఇలా వెనక ముందు టీఆర్ యస్ లో చేరిన వారిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , పట్నం మహేందర్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర రావు , నామ నాగేశ్వర రావు , కడియం శ్రీహరి. తలసాని శ్రీనివాస్ యాదవ్ , లాంటి ముఖ్యులు ఉన్నారు. బీజేపీ లో చేరిన పెద్దిరెడ్డి , మోత్కు పల్లి నరసింహులు ఆ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చారు. ఇరుకుడా టీఆర్ యస్ లో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీమంత్రి ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం పెద్ద సంచలనం కాకపోయినా బీజేపీకి నైతిక దెబ్బేనని పరిశీలకుల అభిప్రాయం. పెద్ది రెడ్డి తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పంపించారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో పార్టీలో కొనసాగలేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి గత కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.

ఇటీవల ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీకి మరింత దూరం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ నుంచి బీజేపీ టికెట్ ఆశించిన ఆయన, ఇటీవలి పరిణామాలతో నిరాశకు గురయ్యారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తనతో చర్చించకుండానే ఈటలను పార్టీలోకి తీసుకున్నారని ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

Leave a Reply

%d bloggers like this: