రాజీనామా చేస్తూ కంటతడి పెట్టిన యడియూరప్ప నాకు ఎప్పుడూ అగ్ని పరీక్షే ఆవేదన!

రాజీనామా చేస్తూ కంటతడి పెట్టిన యడియూరప్ప నాకు ఎప్పుడూ అగ్ని పరీక్షే ఆవేదన
-నేరుగా రాజ్‌భ‌వ‌న్ కు వెళ్లిన య‌డియూర‌ప్ప‌
-రాజీనామా లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్‌కు సమర్పించిన -య‌డియూర‌ప్ప‌..రాజీనామాకు గవర్నర్ ఆమోదం
-దళితవర్గం నుంచి కొత్త ముఖ్యమంత్రి?
-కర్ణాటకలో రాజకీయ సంక్షోభం
-ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలన్న గవర్నర్
-తదుపరి సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న ఆసక్త
-రేపు బీజేపీ పార్ల‌మెంట‌రీ స‌మావేశం
-కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న అధిష్ఠానం
-రెండేళ్ల పాలనపై జరిగిన సమావేశంలో యడియూరప్ప ఉద్వేగం
-కేంద్ర మంత్రి పదవిని కూడా వద్దని, కర్ణాటకకే పరిమితమయ్యానని వ్యాఖ్య
-ఈ రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని ఆవేదన

కర్ణాటకలో అనూహ్య రాజకీయ సంక్షోభం నెలకొంది. సీఎం యడియూరప్ప ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. కాగా, యడియూరప్ప రాజీనామాను గవర్నర్ తవర్ చంద్ గెహ్లాట్ ఆమోదించారు. ప్రస్తుతానికి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను గవర్నర్ కోరారు.

కాగా, నిన్న బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడా కూడా యడియూరప్పపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. పైగా, యడ్డి పాలన బాగానే ఉందంటూ కితాబిచ్చారు. కానీ, పార్టీ అంతర్గత ఆదేశాల మేరకే యడ్డి సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఇక, కర్ణాటక తదుపరి సీఎం ఎవరన్నదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ సాయంత్రం గానీ, రేపు గానీ బీజేపీ అధిష్ఠానం నుంచి దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న నేరుగా రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్ థావర్ చంద్ గహ్లోత్‌ కు రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. మధ్యాహ్నం రెండు గంటలకు గవర్నర్ కార్యాలయానికి వెళ్ల‌డానికి ఆయ‌న నిన్న‌నే అపాయింట్ మెంట్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. chivari kshanam వరకు ఆయన రాజీనామా amsham gopyemgane ఉంది. బీజేపీ adyakshudu jepi nadda ninna goa లో మీడియా matladutu యడియూరప్ప మార్పు vishayam vilekarlu prastavinchaga ఆయన bhagane panichestunnaruga అని అన్నారు meke aayannu మార్చాలని ఉన్నట్లు ఉందని కూడా chirunavvuto అన్నారు. .

మరోపక్క, క‌ర్ణాట‌క కొత్త ముఖ్య‌మంత్రి పేరును బీజేపీ అధిష్ఠానం ఖ‌రారు చేయ‌నుంది. ఇందుకోసం రేపు ఢిల్లీలో బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం కానుంది. కాగా, కర్ణాటకలో నాయకత్వ మార్పు తప్పదని ఇటీవ‌ల ఊహాగానాలు వచ్చాయి. చివరికి అవి నిజ‌మ‌వుతున్నాయి. య‌డియూర‌ప్ప‌ క‌ర్ణాట‌క‌కు నాలుగు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. రెండేళ్ల క్రితం క‌ర్ణాట‌క సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలాక ఆయ‌న సీఎం ప‌ద‌విని చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

నేటితో ఆయ‌న ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. య‌డియూర‌ప్ప‌కు 78 ఏళ్లు కావ‌డం, ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డం వంటి అంశాలు ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డానికి కార‌ణాలుగా తెలుస్తోంది. 75 ఏళ్లు దాటిన వారు ప‌ద‌వుల్లో ఉండ‌డానికి వీల్లేద‌ని బీజేపీ నియ‌మాలు పాటిస్తోంది. సీఎం ప‌దవికి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ పార్టీ అభివృద్ధికి స‌హ‌క‌రిస్తాన‌ని య‌డియూర‌ప్ప అన్నారు.

kaga , క‌ర్ణాట‌క‌లో ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి చేస్తార‌న్న ప్రచారం కూడా జ‌రుగుతోంది. క‌ర్ణాట‌క త‌దుప‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశంలో జ‌రిగే త‌దుప‌రి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను కూడా దృష్టిలో పెట్టుకుని రేపు బీజేపీ పార్ల‌మెంట‌రీ స‌మావేశం కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనుంది.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వ రెండేళ్ల పాలనపై బెంగళూరులో ఈరోజు జరిగిన సమావేశంలో యడియూరప్ప మాట్లాడుతూ, తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కళ్లు చెమ్మగిల్లాయి.

అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండాలని తనను అడిగారని… కానీ, తాను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పానని అన్నారు. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటూ వచ్చిందని చెప్పారు. తనకు ఎప్పుడూ అగ్ని పరీక్షే ఎదురవుతుంటుందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఈ రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని… అయినప్పటికీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపానని అన్నారు. కర్ణాటక ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: