ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో విచారణ!

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టులో విచారణ
ఇప్పటికే పలువురు సాక్షుల వాంగ్మూలం నమోదు
రేవంత్, స్టీఫెన్ సన్ కాల్ లిస్టు రిపోర్టు పరిశీలించాలని నిర్ణయం
తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా
2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారం

కొన్నేళ్ల కిందట సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు నేడు విచారణ కొనసాగించింది. కోర్టు ఇప్పటికే పలువురు సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది. తాజాగా, ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్ ల కాల్ లిస్టు రిపోర్టును పరిశీలించాలని కోర్టు నిర్ణయించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో నిన్న రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కూడా కోర్టు నమోదు చేసింది.

2015లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతూ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభాలకు గురిచేశారని, రూ.50 లక్షలు ఇవ్వజూపారని రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ ఏసీబీ కేసు పెట్టింది. దీనిపై అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది.

 

Leave a Reply

%d bloggers like this: