Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రం పేరు మార్పు, కరోనా వ్యాక్సిన్ లపై ప్రధానితో మాట్లాడాను: మమతా బెనర్జీ!

రాష్ట్రం పేరు మార్పు, కరోనా వ్యాక్సిన్ లపై ప్రధానితో మాట్లాడాను: మమతా బెనర్జీ
-మోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ
-పెగాసస్ పై మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తే బాగుంటుందన్న దీదీ
-ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని వ్యాఖ్య

అసలే వారిద్దరికీ ఎడముఖం పెడముఖం …. అయినప్పటికీ ప్రధాని హోదాలో మోడీ ,ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. వీరు ఏమి మాట్లాడారు అనేది ఆశక్తిగా మారింది.దీనిపై తెలుసుకుందుకు మీడియా సైతం ఉత్సాహం చూపింది. మమతా చెప్పనే చెప్పారు. సహజంగా ప్రధానితో భేటీ అయినా తరువాత ముఖ్యమంత్రులు కొందరు మీడియా కు బ్రీఫ్ చేస్తారు … కొందరు చేయకుండానే వెళ్ళిపోతారు. మమతా కూడా ప్రధానిని కలిసిన తరువాత వెళ్లి పోయారు. దీంతో మీడియా వాళ్ళు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆమె ప్రధానితో ఏమి మాట్లాడి ఉంటారని … ఆమె మీడియా మాట్లాడారు .పశ్చిమ బెంగాల్ పేరు మార్చాలని కోరినట్లు తెలిపారు.కరోనా వ్యాక్సిన్ డోస్ లు తమ రాష్ట్రానికి మరిన్ని కావాలని అడిగానని అన్నారు. అయితే రాష్ట్రము పేరు మరుపుపై ప్రధాని సైతం సానుకూలంగా స్పందించారని అన్నారు.

ప్రధాని మోదీతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ. మర్యాదపూర్వకంగానే ప్రధానితో సమావేశమయ్యానని చెప్పారు. రాష్ట్రానికి మరిన్ని కరోనా వ్యాక్సిన్ డోసులు అవసరమని కోరానని తెలిపారు. పశ్చిమబెంగాల్ పేరు మార్పు అంశాన్ని లేవనెత్తానని చెప్పారు. పేరు మార్పు అంశాన్ని పరిశీలిస్తానని ఆయన అన్నారని తెలిపారు.

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పెగాసస్ అంశంపై ప్రధాని అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని ఆమె చెప్పారు. ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని అన్నారు. మరోవైపు పెగాసన్ అంశంపై ఇప్పటికే మమతా బెనర్జీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. పెగాసస్ వ్యవహారంలో మోదీ మౌనంగా ఉన్నారని… అందుకే తాము విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశామని ఆ సందర్భంగా ఆమె చెప్పారు.

Related posts

టీడీపీ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పులో తుఫాన్!

Drukpadam

ఉచిత విద్యుత్‌పై వ్యాఖ్యల వివాదం.. రేవంత్ రెడ్డి ట్వీట్!

Drukpadam

ఉద్ధవ్ థాకరేతో సీఎం కేసీఆర్ ఆదివారం ముంబై లో లంచ్ మీట్ !

Drukpadam

Leave a Comment