Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాజకీయ లబ్ది కోసమే జెడి లక్ష్మీనారాయణ పిటిషన్ :కేంద్రం కౌంటర్ అఫిడవిట్!

రాజకీయ లబ్ది కోసమే జెడి లక్ష్మీనారాయణ పిటిషన్ :కేంద్రం కౌంటర్ అఫిడవిట్
-ఆ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న కేంద్రం ….
-విశాఖ ఉక్కు ప్రవేటీకరణపై జెడి లక్ష్మీనారాయణ హైకోర్టు లో పిటిషన్
-విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణయాన్ని పిటిష‌న్
-గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విశాఖ నుంచి ల‌క్ష్మీ నారాయ‌ణ పోటీచేశారన్న కేంద్రం
-ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్‌ వేశారని వ్యాఖ్య‌
-నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే పెట్టుబ‌డ‌లు ఉప‌సంహ‌ర‌ణ చేస్తున్నామ‌ని వివ‌ర‌ణ

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయ‌ణ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లుకు వారం రోజుల స‌మ‌యం ఇవ్వాల‌ని ఇటీవ‌లే న్యాయ‌స్థానాన్ని కేంద్ర ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది కోరారు.

దీంతో ఆగ‌స్టు 2 లోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించడంతో ఈ రోజు కేంద్ర స‌ర్కారు కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉప సంహరణ జరుగుతోందని వివ‌రించింది.

ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. దేశ ఆర్థిక అవసరాలపై తీసుకున్న నిర్ణయాలపై విచారణ స‌రికాద‌ని చెప్పింది. ఇప్ప‌టికే ఇటువంటి పెట్టుబడుల ఉపసంహరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ప‌లు తీర్పులు ఉన్నాయని తెలిపింది.

ఈ ప్రక్రియను అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని చెప్పింది. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ల‌క్ష్మీ నారాయ‌ణ జ‌న‌సేన త‌ర‌ఫున విశాఖ నుంచి పోటీ చేసి అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌స్తావించింది. వ్యాజ్యం దాఖలు చేసిన లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేశారని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే పిటిషన్‌ వేశారని కౌంటర్‌లో బీజేపీ చెప్పింది. ఆయ‌న పిటిష‌న్ విచారణ అర్హత లేదని అభిప్రాయ‌ప‌డింది.

Related posts

ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌లు.. సోనూసూద్ ఇళ్ల‌పై మ‌ళ్లీ ఐటీ దాడులు…

Drukpadam

దేశద్రోహ చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు… దేశవ్యాపిత చర్చ!

Drukpadam

సీఎం కేసీఆర్ కు జ్వరం… మరో నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే

Drukpadam

Leave a Comment