Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తొలిరోజే రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించిన కర్ణాటక కొత్త సీఎం బొమ్మై!

తొలిరోజే రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించిన కర్ణాటక కొత్త సీఎం బొమ్మై
-వృద్ధాప్య పింఛన్లు రూ. వెయ్యి నుంచి రూ. 1,200కు పెంపు
-వితంతు, దివ్యాంగుల పింఛన్లు రూ. 600 నుంచి రూ. 800కు పెంపు
-రైతు కుటుంబాల పిల్లలకు రూ. వెయ్యి కోట్లతో ఉపకార వేతనాలు

కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలను చేపట్టిన తొలిరోజే రాష్ట్ర ప్రజలపై ఆయన వరాలు కురిపించారు. పింఛన్లను పెంచుతున్నట్టు ప్రకటించారు. వృద్ధాప్య పింఛన్ ను రూ. 1,000 నుంచి రూ. 1,200కు పెంచుతున్నట్టు తెలిపారు. వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను రూ. 600 నుంచి రూ. 800కు పెంచుతున్నట్టు చెప్పారు. రైతు కుటుంబాల పిల్లలకు రూ. 1,000 కోట్లతో స్కాలర్ షిప్ లను ఇవ్వనున్నట్టు తెలిపారు.

మరోవైపు సీఎంగా ప్రమాణం చేసిన బొమ్మైకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బొమ్మై స్పందిస్తూ, తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో సమర్థవంతమైన, పారదర్శకమైన, సుపరిపాలన అందిస్తానని తెలిపారు.

Related posts

సోనియా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం పై మోడీ పరోక్ష వ్యాఖ్యలు ..

Drukpadam

బీఆర్ యస్ లో అంతా గుంభనం…మరికొద్ది రోజుల్లో సీట్ల ప్రకటన అంటూ సంకేతాలు …

Drukpadam

పొంగులేటికి రెండు పార్టీల ఆహ్వానం …ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్న పొంగులేటి…!

Drukpadam

Leave a Comment