హుజూరాబాద్‌లో ఈటల గెలుపు పక్కా: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

హుజూరాబాద్‌లో ఈటల గెలుపు పక్కా: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-తన సర్వే లో తేలిందని వెల్లడి
-ఈటల రాజేందర్‌కు 67 శాతం ఓట్లు
-టీఆర్ఎస్‌కు రెండోస్థానమే
-హుజూరాబాద్‌లో తాను సర్వే చేయించానన్న కోమటిరెడ్డి
-తెలంగాణలో పాలన తేజరాజు చేతిలో ఉందని ఆరోపణ

కాంగ్రెస్ లో అసమ్మతి నాయకుడిగా ముద్రపడిన భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి సోదరులు వేది చేసిన సంచలనంగానే మారుతుంది. నిన్నటివరకు తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికోసం కొట్లాడిన వెంకటరెడ్డి అది రాకపోయేసరికి కాంగ్రెస్ పైన తీవ్ర విమర్శలు చేశారు. కొత్తగా నాయకత్వ స్వీకరించిన నాయకుడు హుజురాబాద్ లో డిఫాజిట్ తెచ్చు కోమనండి చూద్దాం అన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పైన ఆరోపణలు చేశారు. తరువాత తాను విమర్శల జోలికి పోనని చెప్పారు. ఇటీవల ఆయన కేంద్ర కాబినెట్ మంత్రిగా భాద్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. రేవంత్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి కోమటి రెడ్డి సోదరులు హాజరు కాలేదు. పైగా అంతకు ముందు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీ లో చేరనున్నట్లు చెప్పారు. కాని ఎందుకో వెనకడుగు వేశారు. ఇప్పడు వెంకటరెడ్డి హురాబాద్ లో సర్వే చేయించి బీజేపీ అభ్యర్థి ఈటల గెలుపు పక్కా అంటున్నారు. పైగా ఈటలకు 67 ఓట్లు , టీఆర్ యస్ కు 30 శాతం , కాంగ్రెస్ కు 5 శాతం మించి ఓట్లు రావని ఒక కాంగ్రెస్ ఎంపీ చెప్పడం పై కాగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురిఅవుతున్నాయి

హురాబాద్ ఎన్నికపై కోమటిరెడ్డి ….

హుజూరాబాద్‌ ఉన ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం పక్కా అని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు. తాను చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఐదు శాతానికి మించి ఓట్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఈటలకు 67 శాతం, టీఆర్ఎస్‌కు 30 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారు.

అయితే, కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించడమే తన లక్ష్యమని వెంకటరెడ్డి అన్నారు.

రాష్ట్ర పాలనపై …కోమటిరెడ్డి వెంకటరెడ్డి ….

తెలంగాణలో పాలన కేటీఆర్ మిత్రుడు, ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యం రామలింగరాజు కుమారుడు తేజరాజు చేతిలో ఉందని ఆరోపించారు. నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

%d bloggers like this: