కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు …

కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు …
-డబ్బు సంపాదన పైనే వారి ధ్యాస
-వారిద్దరికీ ప్రజల్లో విశ్వసనీయత ఎప్పుడో పోయింది
-సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారు
-మీడియా ప్రచారం కోసం పాకులాడుతుంటారు

కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికీ డబ్బు సంపాదనే ద్యేయం తప్ప మరొకటిలేదని అన్నారు. నియోజకవర్గ ప్రజలే వారు ఆంటే చీదరించుకుంటున్నారని అన్నారు. వారి బెదిరింపులు కాంగ్రెస్ లో సరిపోతుందేమో గాని టీఆర్ యస్ లో చెల్లదని అన్నారు. జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య తరచూ వివాదాలు జరుగుతుంటాయి. ఒకరిపై మరొకరికి పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. ఇటీవల రేషన్ కార్డుల పంపిణి కార్యక్రంలో మంత్రి కి ఎమ్మెల్యేకి మధ్య వేదికపైనే కొట్టుకునేంత పని అయింది. మంత్రి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి తన పర్యటనలో భాగంగా మునుగోడు నుంచి వెళుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రిని అడ్డుకున్నారు. దీంతో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఎమ్మెల్యే పై కేసు నమోదు అయింది. దీనిపై రాజగోపాల్ రెడ్డి మంత్రిపై ఫైర్ అయ్యారు. ప్రతిగా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లపై మండిపడ్డారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ పై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటిరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ప్రజల్లో విశ్వసనీయత ఎప్పుడో పోయిందని జగదీశ్ రెడ్డి అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలే వారిని చీదరించుకుంటున్నారని చెప్పారు. మీడియా ప్రచారం కోసం పాకులాడటమే తప్ప… ప్రజలకు మేలు చేయాలనే తపన వారికి ఏనాడూ లేదని అన్నారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఎప్పుడూ డబ్బు సంపాదన పైనే ధ్యాస అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సమాజం అభివృద్ధి చెందాలనే తపన ఉంటే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల అమలుకు సహకరించాలని… లేకపోతే సొంత నియోజకవర్గ ప్రజల నుంచే వారికి వ్యతిరేకత ఎదురవుతుందని అన్నారు.

ఇంతకు ముందు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఊరుకునేది లేదని.. గుడ్డలు ఊడదీస్తానని హెచ్చరించారు. మీరు భయపెడితే భయపడటానికి తాము కాంగ్రెస్ నాయకులం కాదని చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: