సేవ్ ఇండియా హటావో బీజేపీ….దేశవ్యాప్త నిరసనలు…

సేవ్ ఇండియా హటావో బీజేపీ
ఆగస్టు 9 క్విట్ ఇండియా రోజు దేశవ్యాప్త నిరసనలు
కార్మికులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని
సిఐటియు – రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు.

ఖమ్మం
క్విట్ ఇండియా డే ఉద్యమ స్పూర్తి తో సేవ్ ఇండియా ఉద్యమాన్ని నడపాల్సిన పరిస్థితి వచ్చిందని మరో దేశ రక్షణ ఉద్యమానికి సిద్ధం కావాలని ఆగస్టు 9న దేశవ్యాప్త నిరసనలో కార్మికులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని  సంఘాల జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వర రావు, మాదినేని రమేష్, కళ్యాణం వెంకటేశ్వర రావు లు పిలుపు నిచ్చారు. దేశంలో బీజేపీ పాలనా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని విమర్శించారు దేశానికి బీజేపీ నుంచి కాపాడాలని అనుదుకే సేవ్ ఇండియా హటావో బీజేపీ నినాదం తో దేశవ్యాపిత నిరసనలకు పిలుపు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు.

సిఐటియు ఖానాపురం హవేలి కమిటీ ఆధ్వర్యంలో కార్మిక వాడలో ప్రచార క్యాంపియన్ నిర్వహించడం జరిగింది. గ్రానైట్ ట్రాక్టర్ డ్రైవర్లు చెన్నై షాపింగ్ మాల్ గుమస్తాలు తదితర సెంటర్లలో కార్మికులలో సభల ద్వారా ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మూడు సంఘాల జిల్లా భాధ్యులు మాట్లాడుతూ దేశంలో విచ్చలవిడిగా ప్రజా ఆస్తుల అమ్మకం, రాజ్యాంగ బద్ద హక్కుల హరింపు, శ్రమ  దోపిడీ, అన్ని రంగాలను కార్పోరేట్ కంపెనీ లకు దోచిపెట్టె చర్యలు మోది ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తుందన్నారు. ఈ చర్యల నుండి దేశాన్ని రక్షికోవడానికి  మూడు సంఘాల జాతీయ కమిటీలు ఆగష్టు 9వరకు ఐక్య కార్యాచరణకు సేవ్ ఇండియా ఉద్యమానికి పిలుపు నిచ్చాయని ఈ పిలుపు లో  అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ ఉపాధ్యక్షులు యర్రా శ్రీకాంత్, పి రమ్య, బండారు యాకయ్య, దొంగల తిరుపతిరావు, అమరావతి మురహరి, చలపతి ,వివిధ అనుబంధ సంఘాల నాయకత్వం పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: