సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ  రైతు అవతారం….   ఫోటోలు వైరల్!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ  రైతు అవతారం….   ఫోటోలు వైరల్
కౌలుకు తీసుకున్న పొలంలో వరినాట్లు వేసిన లక్ష్మీనారాయణ…
సీబీఐ మాజీ జేడీ రైతు అవతారం పై ఆశక్తి
రాజమండ్రి సమీపంలో పొలం లీజుకు తీసుకున్న వైనం
ఉత్సాహంగా పొలం పనుల్లో పాల్గొన్న లక్ష్మీనారాయణ
మిత్రులకు కృతజ్ఞతలు తెలిపిన జెడి

మాజీ సిబిఐ అధికారి ,జాయింట్ డైరక్టర్ గా పని చేసిన లక్ష్మి నారాయణ ఉద్యాగానికి రాజీనామా చేసిన అనంతరం ప్రజలతో కలిసి పోయేందుకు ఉత్సాహం చూపుతున్న విషయం తెలిసిందే . మొదట్లో పాఠాలు చెప్పిన జెడి తరువాత రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీ గా పోటీచేసి ఓడిపోయారు. తరువాత జనసేనకు గుడ్బై చెప్పి రైతు సమస్యలపై కొంత ఆద్యనం చేశారు. తరువాత తానే స్వయంగా రైతు అవతారం ఎత్తారు. అందుకు కొంత భూమిని కౌలుకు తీసుకోని వ్యవసాయం చేస్తున్నారు. తాను తీసుకున్న పొలంలో వరినాట్లు వేస్తూ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ధర్మవరం గ్రామానికి దగ్గర్లోని ఈ వరిపొలంలో ఆయన స్వయంగా నాట్లు వేయడం విశేషం. నారు పీకడం నుంచి నాట్లు వేయడం వరకు అన్నింటా ఉత్సాహంగా పనిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. వరినాట్లు వేసే కార్యక్రమం దిగ్విజయంగా ప్రారంభమైందని, రైతుల నుంచి వ్యవసాయంలో సూచనలు అందుకోవడం మంచి అనుభవం అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తన సన్నిహితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

 

Leave a Reply

%d bloggers like this: