Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జడ్జి హత్యపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ

  • మొన్న ఆటోతో ఢీకొట్టి చంపిన దుండగులు
  • దురదృష్టకరమైన ఘటన అన్న సీజేఐ రమణ
  • మీడియాలో వార్తలు కరెక్ట్ గా వచ్చాయని కామెంట్

ధన్ బాద్ జిల్లా అదనపు జడ్జి హత్యను సుప్రీంకోర్టు సుమోటో విచారణకు స్వీకరించింది. హత్య కేసు విచారణలో పురోగతిపై నివేదికను సమర్పించాల్సిందిగా ఝార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఇవ్వాళ సీజేఐ ఎన్వీ రమణ ఆదేశించారు. దర్యాప్తును ఝార్ఖండ్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని నిన్న సుప్రీంకోర్టు తెలిపింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా కేసును విచారణకు తీసుకుంది.

ఓ జిల్లా జడ్జిని ఆటో రిక్షాతో ఢీకొట్టి హత్య చేయడం దురదృష్టకరమని జస్టిస్ రమణ అన్నారు. మీడియా, సోషల్ మీడియాలో ఆ వార్తను సరైన రీతిలో ప్రచురించారని, ఝార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కేసును పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు.

కాగా, బుధవారం ఉదయం జడ్జి ఉత్తమ్ ఆనంద్ జాగింగ్ చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆటోతో ఢీకొట్టి, హత్య చేసి పరారైన సంగతి తెలిసిందే. సీసీటీవీ ఫుటేజీతో విషయం వెలుగులోకి రావడంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తమ్ ఆనంద్ కు చాలా స్ట్రిక్ట్ జడ్జిగా పేరుంది. ఇటీవల కొందరు గ్యాంగ్ స్టర్లకు ఆయన బెయిల్ ను తిరస్కరించారు. ఆ కక్ష కొద్దీ ఆయన్ను హత్య చేసినట్టు తెలుస్తోంది.

Related posts

ముగిసిన సూర్య గ్రహణం… ఏపీలో మళ్లీ తెరుచుకుంటున్న ఆలయాలు!

Drukpadam

పరువునష్టం కేసులో రాహుల్ కు నిరాశ…స్టేకు నో అన్న సూరత్ సెషన్ కోర్ట్ …

Drukpadam

జనాభాలో చైనాను అధిగమించిన భారత్ …

Drukpadam

Leave a Comment