ఈటలకు తీవ్ర అస్వస్థత … చికిత్స కోసం హైద్రాబాద్ తరలింపు!

ఈటలకు తీవ్ర అస్వస్థత … చికిత్స కోసం హైద్రాబాద్ తరలింపు
-అర్థాంతరంగా నిలిచిపోయిన ఈటల పాదయాత్ర
కొనసాగించిన ఆయన భార్య జమున మూడు గ్రామాల్లో పర్యటన
-వీణవంక మండలం కొండపాకలో నిలిచిపోయిన పాదయాత్ర
-బీపీ డౌన్ … పెరిగిన షుగర్ లెవల్స్
-ఇప్పటివరకు 70 గ్రామాలూ 222 కి .మీ పాదయాత్ర
-హైద్రాబాద్ నిమ్స్ లో చికిత్స
-కొన్ని రోజులు విశ్రాంతి అవసరం అన్న వైదులు

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అస్వస్థతకు లోనయ్యారు. ప్రజా దీవెన యాత్ర పేరిట చేపట్టిన ఈ పాదయాత్రలో భాగంగా ఈటల నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం కొండపాక వరకు నడిచారు.

బీజేపీ నేత ఈటల రాజేందర్ ఉపఎన్నిక జరగనున్న హుజురాబాద్ లో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ఆయన గత కొన్ని రోజులుగా ఎండా ,వర్ష సైతం లెక్క చేయకుండా నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. విరామం లేకుండా చేస్తున్న ఈ పాదయాత్ర వల్ల ఆయన కాళ్లు వాచిపోయాయి. బీపీ డౌన్ అయింది. షుగర్ లెవల్స్ పెరిగాయి. దీంతో అయన నడవలేకుడా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానిక వైద్యులకు చూపించారు. వారి సలహా మేరకు చికిత్సనిమిత్తం హైద్రాబాద్ తరలించారు. ఇప్పటివరకు ఆయన 70 గ్రామాలలో పాదయాత్ర పూర్తీ చేశారు. 222 కి .మీ నడిచారు. ఉదయం, సాయంత్రం పాదయాత్ర సభల్లో పాల్గొనటంతో బాగా నిరసించారు .

మధ్యాహ్న భోజనం అనంతరం ఈటల ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించింది. వైద్యులు పరీక్షలు చేయగా, జ్వరం, కాళ్ల నొప్పులతో ఈటల బాధపడుతున్నట్టు వెల్లడైంది. రక్తపోటు తగ్గిందని, షుగర్ లెవెల్స్ పెరిగాయని గుర్తించారు. దాంతో వైద్యుల సూచన మేరకు ఆయనను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.

కాగా, ఈటల ఆసుపత్రి పాలవడంతో పాదయాత్రను ఆయన భార్య జమున కొనసాగించారు. నియోజకవర్గంలోని మూడు గ్రామాల్లో పర్యటించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఈటలకు ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, కోలుకున్న తర్వాత పాదయాత్ర కొనసాగిస్తారని రవీందర్ రెడ్డి తెలిపారు.

ఈటల అస్వస్థతకు గురైయ్యారనే వార్త నియోజకవర్గంలో చర్చనీయాంశం అయింది. ప్రతిగ్రామంలో ఆయన ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు

 

Leave a Reply

%d bloggers like this: