యోగా గురు బాబా రాందేవ్ ను వెంటాడుతున్న కేసులు ​!

యోగా గురు బాబా రాందేవ్ ను వెంటాడుతున్న కేసులు ​!
-అల్లోపతి వైద్యుల మీద దుష్ప్రచారంపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు
-వచ్చే నెల 10న విచారించనున్న కోర్టు
-అల్లోపతితో లక్షలాది కరోనా పేషెంట్లు చనిపోయారన్న రాందేవ్
-రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పినప్పటికీ కేసులు వదల్లేదు

యోగ గురువుగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న బాబా రాందేవ్ ని కేసులు వెంటాడుతున్నాయి. గతంలోనూ ఆయన అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రపంచానికి యోగ పాఠాలు చెప్పే బాబా అల్లోపతి పై నోరు జారీ చిక్కుల్లో పడ్డారు. ఐఎంఎ కి బాబాకు మధ్య అల్లోపతి ఆయుర్వేదంపై మతాల యుద్ధం జరుగుతూనే ఉంది. ఒక సందర్భంలో కేంద్రం కూడా జోక్యం చేసుకుంది. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్ష వర్ధన్ సూచనమేరకు అల్లోపతి వైద్యంపై తన మాటలపై క్షమాపణలు చెప్పారు. అంత సర్దుకొని పోయిందన్న సందర్బాల్లో తిరిగి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేయడం ఆశక్తిగా మారింది. ఐఎంఎ బాబా విషయంలో చాల సీరియస్ గానే ఉంది . ఢిల్లీ కోర్ట్ లో బాబా కేసు క్లోజ్ చేసుకుంటారో వారిపై యుద్ధం కోనసాగిస్తారో అనేది చూడాలి …

యోగా గురు బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులిచ్చింది. అల్లోపతి వైద్యం, వైద్యుల మీద దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై సమన్లు జారీ చేసింది. కేసును కోర్టు వచ్చే నెల 10న విచారించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా, అంతకుముందు అల్లోపతి ఔషధాల వల్ల లక్షలాది మంది కరోనా పేషెంట్లు చనిపోయారని బాబా రాందేవ్ అన్నారు.

ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రతినిధులు ఆ వ్యాఖ్యలను ఆక్షేపిస్తూ, పరువునష్టం నోటీసులిచ్చారు. క్షమాపణలు చెప్పకపోతే రూ.వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. విషయంలో జోక్యం చేసుకున్న అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సిందిగా రాందేవ్ కు సూచించారు. దీంతో రాందేవ్ ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. తర్వాత కూడా ఐఎంఏ పాట్నా, రాయ్ పూర్ సహా వివిధ ప్రాంతాల్లో రాందేవ్ పై కేసులు పెట్టింది.

Leave a Reply

%d bloggers like this: