Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దళితుల వ్యతిరేకత మధ్యనే దేవినేని ఉమ కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు!

దళితుల వ్యతిరేకత మధ్యనే దేవినేని ఉమ కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు!
ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా? డీజీపీ ఏం చేస్తున్నారు అని చంద్రబాబు మండిపాటు
కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ధ్వజం
దేవినేని ఉమపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం
ఏపీ పోలీసులు చేతులారా చెడ్డపేరు తెచ్చు కుంటున్నారన్న బాబు
రాజమండ్రి జైల్లో ఉన్న దేవినేని ఉమ
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ నేత మాజీమంత్రి దేవినేని ఉమ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు . దళితులూ పెద్ద ఎత్తున చంద్రబాబు రాకపై పెద్ద ఎత్తున నిరసన తెలిపారు చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ప్లే కార్డులు ప్రదర్శించారు. ఈ సందరభంగా టీడీపీ కార్యకర్తలకు , దళితులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది …. పరస్పరం నిందించుకున్నారు. తోపులాట జరిగింది. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించడం సిగ్గు చేటని చంద్రబాబు పై మండిపడ్డారు. ఉద్రిక్తల నడుమనే చంద్రబాబు ఉమ కుటుంబసభ్యులను పరామర్శించారు . వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఉమ నివాసం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చంద్రబాబు రాక సందర్భంగా ఉమ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం , ముఖ్యమంత్రి జగన్ పైన ,ఏపీ పోలీలులపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.మనరోజు కూడా ఒకటి వస్తున్నాడని గుర్తుచుకొవాలని హెచ్చరించారు…. గూగుల్ మ్యాప్స్ లో కూడా ఈ విషయం క్లియర్ గా కనిపిస్తుందని అన్నారు. కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారని మండిపడ్డారు. గ్రీన్ ట్రైబ్యునల్ కూడా అక్రమ మైనింగ్ జరుగుతోందని స్పష్టం చేసిందని చెప్పారు.

ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లి వస్తున్న దేవినేని ఉమపై వైసీపీ గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. దాదాపు 9 గంటల పాటు ఉమ కారులోనే ఉన్నారని… అలాంటి వ్యక్తి కారులో నుంచే ఇతరులపై ఎలా దాడికి పాల్పడతారని ప్రశ్నించారు. కారులో ఉన్న ఆయన బయటున్న వారిని ఎలా దూషిస్తారని అన్నారు. ఉమపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా, తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి కి సిగ్గుందా? అని ప్రశ్నించారు. ఈ డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఉమపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే సీనియర్ ఐపీఎస్ అధికారిగా మీరేం చేస్తున్నారని మండిపడ్డారు.

దేశంలోనే అత్యున్నత పోలీసులుగా పేరుగాంచిన ఏపీ పోలీసులు… చేతులారా వారికివారే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి అరాచకాలను తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది డీజీపీలను చూశానని చెప్పారు. డీజీపీ, పోలీసులు చట్టబద్దంగా వ్యవహరిస్తూ, ప్రజల్లో ధైర్యం నింపేలా వ్యవహరించాలని అన్నారు. పరిపాలించడం చేతకాని జగన్… రాష్ట్రమంతా పులివెందుల పంచాయతీ తీసుకొస్తారని తాను ఎప్పుడో చెప్పానని తెలిపారు. ఇలాంటి సీఎంలను తాము ఎందరినో చూశామని… అధికారం శాశ్వతం కాదని, ఎవరైనా ఏదో ఒకరోజు అధికారాన్ని కోల్పోవాల్సిందేనని చెప్పారు.

చంద్రబాబు రాక సందర్భంగా ఉమ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. దేవినేని ఉమ ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు కుట్ర, హత్యాయత్నం సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ పనులను పరిశీలించి వస్తుండగా జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు.

Related posts

త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ … కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి అవకాశం!

Drukpadam

రాష్ట్రపతి రేసులో వెంకయ్య నాయుడు, గులాంనబీ ఆజాద్ ఉన్నారా ?

Drukpadam

ఐరాసలో ఆఫ్ఘనిస్థాన్ రాయబారిగా సుషైల్ షహీన్.. ప్రతిపాదించిన ఆ దేశ విదేశాంగ మంత్రి!

Drukpadam

Leave a Comment