Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దేవినేని ఉమా స్వాతంత్ర పోరాటం చేశాడని పలకరించడానికి వచ్చారా?: చంద్రబాబుపై కృష్ణప్రసాద్ విసుర్లు!

దేవినేని ఉమా స్వాతంత్ర పోరాటం చేశాడని పలకరించడానికి వచ్చారా?: చంద్రబాబుపై కృష్ణప్రసాద్ విసుర్లు
-గొల్లపూడి వచ్చిన చంద్రబాబు
-ఉమా కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ
-విద్వేషాలు రగల్చడానికే చంద్రబాబు వచ్చారన్న వసంత
-చంద్రబాబుకు ఏంతెలుసని ప్రశ్నించిన వైనం

దళితులపై దాడి వెనక చంద్రబాబు పాత్ర ఉంది…ఎంపీ నందిగం సురేష్

కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ పై జరుగుతుందంటూ టీడీపీ ఆరోపిస్తుండగా ఇది తప్పుడు ఆరోపణ అని దేవినేని ఉమ అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టి దళితులపై దాడులకు పాల్పడుతున్నాడని వైకాపా ఎదురు దాడికి దిగింది. పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలతో కొండపల్లి ప్రాంతంలో ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. దేవినేని ఉమ అరెస్ట్ , రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు జరిగిపోయాయి. అయితే అరెస్ట్ అయిన ఉమ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించేందుకు వచ్చారు. చంద్రబాబు పర్యటనను దళితులూ తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ప్లే కార్డులు ప్రదర్శించారు. ఉమ మాపై దాడులు చేస్తే పరామర్శించాలిసింది మమ్ములను కానీ ఉమ కుటుంబాన్ని పరామర్శించడం ఏమిటి అని దళితులూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఉమ ఏమైనా స్వతంత్ర పోరాటం చేసి జైలుకు వెల్లడ పరామర్శించడానికి అని ధ్వజమెత్తారు.

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గొల్లపూడి రావడంపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శలు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే చంద్రబాబు గొల్లపూడి వచ్చాడని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే ఆయన పర్యటిస్తున్నారని మండిపడ్డారు. దేవినేని ఉమా ఏమైనా స్వాతంత్ర
సమర యోధుడని పలకరించడానికి వచ్చారా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. దేవినేని ఉమా చెప్పిన అవాస్తవాలను నిజం చేయడానికే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేశారని కృష్ణప్రసాద్ ఆరోపించారు.

అసలు, మైలవరంలో జరుగుతున్న అంశాలపైనా, కొండపల్లి అటవీప్రాంతం గురించి చంద్రబాబుకు ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఉమా తప్పు చేసిన విషయం చంద్రబాబుకు కూడా తెలుసని, ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా సీఎం జగన్ పై ఉమా చేస్తున్న దుష్ప్రచారంతో విసిగిపోయిన ప్రజలు తిరగబడ్డారని వసంత కృష్ణప్రసాద్ వివరించారు.

 

దళితులపై దాడి వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉంది: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్

  • -ఉమ కుటుంబానికి బాబు పరామర్శ
  • -ఉమ దళితులపై దాడి చేశారంటున్న వైసీపీ నేతలు
  • -చంద్రబాబు పరామర్శించడమేంటని ఆగ్రహం
  • -చంద్రబాబు పాములా పగబట్టారని వ్యాఖ్యలు
YCP MP Nandigam Suresh fires on Chandrababu

దళితులపై దాడికి పాల్పడిన దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రావడం దుర్మార్గమని వైసీపీ ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. దళితులపై దాడి వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ, చంద్రబాబు దళితద్రోహి అని మరోసాని నిరూపితమైందని అన్నారు. దళితులపైనే దాడి జరిగితే, దాడి చేసిన వారిని పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడించారన్న కక్ష కట్టిన టీడీపీ దళితులపై దాడులకు దిగుతోందని ఆరోపించారు. చంద్రబాబు దళితులపై ఓ పాములా పగబట్టారని విమర్శించారు.

Related posts

రేవంత్ రెడ్డి డైరక్షన్ లో పొన్న ప్రభాకర్ కోవర్ట్ … కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు…

Drukpadam

అమరావతి ఉద్యమానికి 600 రోజులు…ఉద్యమకారుల ర్యాలీ నిరాకరించిన పోలీసులు!

Drukpadam

రాఫెల్ డీల్ దొంగతనం ఢిల్లీలో బట్టబయలు చేస్తాం: సీఎం కేసీఆర్!

Drukpadam

Leave a Comment