Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్ లో సింధు ఓటమి!

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్ లో సింధు! -ఓటమిసెమీఫైనల్లో తై జు యింగ్ విజయం
-18-21, 12-21తో సింధు పరాజయం
-వరుసగా రెండు గేములూ ప్రత్యర్థికి కోల్పోయిన వైనం
-రేపు కాంస్యం కోసం ఆడనున్న సింధు
-సింధు దూకుడుగా ఆడేందుకు తై జు అవకాశం ఇవ్వలేదు: తండ్రి పీవీ రమణ

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో నిరాశాజనకమైన ఫలితం ఎదురైంది. స్వర్ణం తెస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ తై జు యింగ్ (చైనీస్ తైపే) తో ఈ మధ్యాహ్నం జరిగిన పోరులో సింధు 18-21, 12-21తో పరాజయం చవిచూసింది. తొలి గేమ్ లో పోరాడిన సింధు, రెండో గేమ్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా, ఆపై క్రమేణా మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. శక్తిమంతమైన షాట్లు, తెలివైన క్రాస్ కోర్టు ఆటతీరుతో తై జు యింగ్ మ్యాచ్ ను తన వశం చేసుకుంది. ఇక సింధు రేపు కాంస్యం కోసం జరిగే మ్యాచ్ లో ఆడనుంది.

కుమార్తె ఓటమిపై స్పందించిన పీవీ రమణ

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్ లో తన కుమార్తె పీవీ సింధు ఓటమిపాలవడం పట్ల పీవీ రమణ స్పందించారు. కీలకమైన సెమీస్ సమరంలో సింధు ఆట లయ తప్పిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ పతకం సాధించాలన్న పట్టుదల సింధు ప్రత్యర్థి తై జు యింగ్ లో కనిపించిందని వ్యాఖ్యానించారు. సింధు దూకుడుగా ఆడేందుకు తై జు యింగ్ అవకాశం ఇవ్వలేదని అన్నారు. అయితే సింధును ఓడించిన తై జు యింగ్ ప్రపంచ నెంబర్ అని గుర్తుంచుకోవాలని రమణ పేర్కొన్నారు.

సెమీఫైనల్ మ్యాచ్ లో తై జు యింగ్ ఎంతో వ్యూహాత్మకంగా ఆడిందని తెలిపారు. తొలి గేమ్ ను గెలిచిన ఊపుతో ఆమె రెండో గేమ్ ను మరింత ఉత్సాహంగా ఆడిందని వెల్లడించారు. ఈ మ్యాచ్ లో ఎక్కువ సేపు ర్యాలీలు ఆడకుండా తై జు జాగ్రత్త పడిందని వివరించారు. సింధు రేపు బాగా ఆడి కాంస్యం తీసుకువస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. సింధు కోచ్ పై సంతృప్తికరంగానే ఉన్నామని పీవీ రమణ స్పష్టం చేశారు.

సిందు ఈ మధ్యాహ్నం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్ పోరులో వరుస గేముల్లో తై జు యింగ్ కు తలవంచింది. గత ఒలింపిక్స్ లో తనను ఓడించిన సింధుపై ఈ ఓటమి ద్వారా తై జు ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఇక, రేపు కాంస్యం కోసం జరిగే పోరులో సింధు… చైనాకు చెందిన హి బింగ్ జియావోతో తలపడనుంది.

Related posts

చెస్ బోర్డ్ మాదిరిగా కనిపించే రైల్వే స్టేషన్ ఇది..!

Drukpadam

జర్నలిస్టు ఉద్యమనేత అంబటికి కన్నీటి వీడ్కోలు

Drukpadam

చంద్రబాబును జైల్లో పెట్టడం జగన్ కు నష్టం: ప్రొఫెసర్ హరగోపాల్

Ram Narayana

Leave a Comment