దళిత బందు అమలు కావాలంటే తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని పెరుతున్న డిమాండ్!

దళిత బందు అమలు కావాలంటే తమ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని పెరుతున్న డిమాండ్!
-ఉప ఎన్నిక వ‌స్తే ‘ద‌ళిత బంధు’ కింద త‌మ‌కు కూడా 10 ల‌క్ష‌లు
-కోదాడ‌లో ద‌ళిత సంఘాల ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న
-ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ రాజీనామా చేయాల‌ని డిమాండ్
-ద‌ళిత సంఘాల నేత‌ల అరెస్టు
-రాష్ట్రము అంతటా దళిత బందు వెంటనే అమలు చేయాలనీ డిమాండ్

దళిత బందు పథకంపై రాష్ట్రంలో వినూత్న రీతిలో ఉద్యమాలు జరుగుతున్నాయి. దళిబందులో భాగంగా ఎస్సీ కుటుంబంలో ఒకరికి పదిలక్షణాల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇది నిజంగా ఎస్సీ లను ఆకర్షించే పథకమే . 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని వాగ్దానం చేశారు. అది ఇవ్వలేక పోయారు. దానిపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ పధకం ఆయనను వెంటాడుతుంది. అందువల్ల దళితులకు పది లక్షలు అనే కొత్త పధకాన్ని ప్రకటించారు .

పథకం బాగానే ఉంది. ఒక్క దళితునికి పది లక్షలు ఇస్తామంటే వద్దనే వారు ఎవరు ఉంటారు ? అన్ని పార్టీలు మంచిదే పథకం అన్నాయి. కొంతమంది టీఆర్ యస్ అనుకూల వర్గాలు ఇంతకీ గొప్ప పథకం దేశంలో ఇంతవరకు ఎవరు తేలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కు క్షిరభిషేకం చేశారు.పథకం ఇంకా అమలు కాలేదు. దానిగురించి అధికారిక జి ఓ కూడా విడుదల చేయాల్సి ఉంది. అయితే పైలెట్ ప్రాజక్టు కింద హుజురాబాద్ నుంచే ఈ పధకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అక్క నుంచే ఎందుకనే విమర్శలకు కూడా కేసీఆర్ ఎలాంటి దాపరికాలు లేకుండానే ఒక్కడా ఎన్నికలు జరుగుతున్నందున మొదట దాన్నే ఎంచుకున్నామని తెలిపారు. మాది రాజకీయపార్టీ మేము సన్యాసులం కాము ఫక్తు రాజకీయాలే చేస్తాం అని స్పష్టం చేశారు.

దీనిపై రాష్ట్రవ్యాపితంగా డిమాండ్ లు పెడుతున్నాయి. మాదగ్గర ఉప ఎన్నిక వస్తే తప్ప పథకాలు అమలు కావని అందువల్ల పథకాలు అమలుకు మా ఎమ్మెల్యే రాజీనామా చేసి మరల ఎన్నిక జరగాలని అంటున్నారు. కాంగ్రెస్ కు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నా నియోజకవర్గానికి 2 వేల కోట్లకు ఇసమంటే నేనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. వివిధ నియోజకవర్గాలలో కూడా ఎలాంటి డిమాండ్స్ వస్తున్నాయి. కోదాడలో దళితులు తమ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలనీ ఆందోళన చేపట్టారు ..

సూర్యాపేట జిల్లా కోదాడ‌లో ద‌ళిత సంఘాల ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. హుజురాబాద్ ఎమ్మెల్యే ప‌ద‌వికి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేయ‌డంతో అక్క‌డ ఉప ఎన్నిక వచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ‘ద‌ళిత బంధు’ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం ఆయా కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఇస్తామ‌ని తెలిపింది.

దీంతో త‌మ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ కూడా రాజీనామా చేయాల‌ని, త‌మ‌కు కూడా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టిస్తార‌ని చెబుతూ కోదాడ‌లో ద‌ళిత సంఘాలు ధ‌ర్నా చేప‌ట్టాయి. దీంతో ద‌ళిత సంఘాల‌కు బీజేపీ నేత‌లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఆందోళ‌న‌కు దిగిన ద‌ళిత సంఘాల నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ ఉద్రిక్త‌త నెల‌కొంది.

రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలనుంచి కూడా ఇలాంటి డిమాండ్స్ వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం పైలెట్ ప్రాజక్టు కింద హుజురాబాద్ ను ఎంపిక చేసింది. తరువాత రాష్ట్రము అంత అమలు చేస్తామని అంటుంది . చూద్దాం ఏమి జరుగుతుందో మరి !

Leave a Reply

%d bloggers like this: