నిండు కుండా నందికొండ ….నీటి విడుదలకు కేసీఆర్ ఆదేశం!

నిండు కుండా నందికొండ ….నీటి విడుదలకు కేసీఆర్ ఆదేశం!
-నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌కు నీరు విడుద‌ల ఏర్పాట్లు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి
-ఏర్పట్లలో నిమగ్నమైన అధికారులు
-ఏఎంఆర్పీ నుంచి నీటి విడుద‌ల‌కు కేసీఆర్ ఆదేశాలు
-నాగార్జునసాగర్ జలాశయానికి పెరిగిన‌ వరద
-పూర్తీ స్థాయి నీటి మట్టం 590 అడుగులు
-ప్రస్తుత నీటి మట్టం 580 అడుగులు

నందికొండ నిండుకుండను తలపిస్తున్నది. నల్లగొండ ,ఖమ్మం , జిల్లాల తోపాటు , కృష్ణ జిల్లా నూజీవీడు , తిరువూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాలు ఎడమకాలువ నీటితోనే సాగు అవుతాయి.అందువల్ల ఎడమ కాలువ నీటిని వెంటనే విడుదల చేయాలనీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేహాలు జారీచేశారు.దీంతో అప్రమత్తమైన అధికారులు క్రస్టుగేట్లను పరిశీలించారు. సాగర్ కు పైనుంచి భారీ వరద రావడంతో శ్రీశైలం ప్రాజక్టు నుంచి కూడా నీటిని దిగువకు వదులుతున్నారు.

నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌కు నీటిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించార‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి చెప్పారు. ఎనిమినేటి మాద‌వ‌రెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) నుంచి నీటి విడుద‌ల‌కు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చార‌ని వివ‌రించారు. దీంతో అధికారులు దీనికోసం ఏర్పాటు పూర్తి చేసుకుంటున్నారు.

మ‌రోవైపు, నాగార్జునసాగర్ జలాశయానికి వరద మరింత పెరుగుతోంది. జ‌లాశ‌యంలోని 590 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి గాను ఇప్ప‌టికే 579.20 అడుగుల మేర నీరు చేరింది. 312.04 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారుల సిద్ధ‌మ‌వుతున్నారు. ఎన్నెస్పీ అధికారులు జలాశయం క్రస్ట్ గేట్లను పరిశీలించారు.

సాగర్ నిండు కుండల ఉండటంతో సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. చుట్టుపక్కల నుంచే కాకుండా సుదూర ప్రాంతాలనుంచి ఈ సుందర దృశ్యాలు చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: