Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఒక్క అవకాశం ఇవ్వండి.. తెలంగాణ, ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం: రేవంత్‌రెడ్డి!

ఒక్క అవకాశం ఇవ్వండి.. తెలంగాణ, ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం: రేవంత్‌రెడ్డి
-టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే
-ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏడేళ్లైనా అతీగతీ లేదు
-ఈద్ మిలాప్ కార్యక్రమంలో రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్కడకు వెళ్లిన తనదైన స్టయిల్లో దూసుకు పోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులను ఐక్యం చేసేందుకు కృషి చేస్తూనే వివిధ వర్గాల సమస్యలపై స్పందిస్తున్నతీరు సానుకూల పరిణామంగా మారుతుంది. దానిలో భాగంగానే ఆయన కాంగ్రెస్ ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసం చేసిన మంచి పనులు చెబుతూనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ యస్ ప్రభుత్వం ముస్లింలను ఈ విధంగా మోసం చేసిందో వివరించారు. 12 శాతం రిజర్వేషన్ ఏమైందని ప్రశ్నించారు. ముస్లిం సోదరులను ఓటు బ్యాంకు గానే టీఆర్ యస్ ,బీజేపీ లు చూస్తున్నాయని మాది పడ్డారు . కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని సమర్థించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు .

టీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, నోట్ల రద్దు, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ సమీర్ వలీయుల్లా ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, దాసోజ్ శ్రవణ్, జావిద్, ఫిరోజ్‌ఖాన్ తదితరులతో కలిసి పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏడేళ్లు అయినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదన్నారు. అలాగే, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల హక్కుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పోరాడే కాంగ్రెస్‌కు ముస్లింలు మద్దతు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.

Related posts

పురుషుడిగా మారాలనుకున్న మహిళా కానిస్టేబుల్.. అనుమతి ఇచ్చిన ప్రభుత్వం…

Drukpadam

జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు

Drukpadam

తిరుపతి,సాగర్ ఉపఎన్నికలు ఏప్రిల్ 17

Drukpadam

Leave a Comment