Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రూ.50 వేల లోపు రైతు రుణాల మాఫీకి తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం!

రూ.50 వేల లోపు రైతు రుణాల మాఫీకి తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం!
సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
రైతు రుణమాఫీపై చర్చ
6 లక్షల మంది రైతులకు లబ్ది
ఆగస్టు 15 నుంచి రుణమాఫీ
పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసిన సీఎం

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం ,అభివృద్ధిని రెండుకాళ్ళగా చూస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో 50 వేల లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేయాలనీ ఆదివారం ప్రగతి భవన్ లో జరిగిన కాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అంతే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు దళిత బందు ,చేనేత ఇతర బిసి కులాలకు లబ్ది చేకూరే పధకాలను కూడా ప్రవేశ పెట్టాలని సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆ పధకాల ముఖ్యమంత్రికి పూర్తీ స్వేచ్ఛనిస్తూ కాబినెట్ లో నిర్ణయించినట్లు తెలుస్తుంది.

కాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ….

తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో రైతు రుణ మాఫీలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది రూ.50 వేల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి నెలాఖరులోపు రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తీర్మానించారు. తెలంగాణ మంత్రి మండలి తీసుకున్న రుణమాఫీ నిర్ణయంతో 6 లక్షల మంది రైతులకు ప్రయోజనం దక్కనుంది.

అటు, కేంద్రం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణలో అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కింద ఐదేళ్ల సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు ఇవిగో!

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్య, వైద్య అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మంత్రిమండలి చర్చించింది. ఈ ఆసుపత్రుల సత్వర నిర్మాణం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై మంత్రిమండలి సభ్యులు చర్చించారు. త్వరలో వీటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

వరంగల్, చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్బీ నగర్ గడ్డి అన్నారం, ఆల్వాల్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశం.

అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఇకపై తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) గా నామకరణం.

అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్కచోటనే అందించే సమీకృత వైద్య కళాశాలలుగా కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.

మంజూరైన మెడికల్ కాలేజీలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించడానికి సమకూర్చుకోవాల్సిన మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు.

రాష్ట్రంలో మున్ముందు అనుమతించబోయే మెడికల్ కాలేజీల కోసం స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటినుంచే ప్రారంభించాలని వైద్యాధికారులకు సీఎం ఆదేశం.

అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని క్యాబినెట్ ఆదేశం.

పటాన్ చెరువులో కార్మికులు, ఇతర ప్రజా అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు

 

Related posts

ఖమ్మం మహిళకు అరుదైన గౌరవం

Drukpadam

డోలో- 650 తయారీ సంస్థకు క్లీన్ చిట్ …

Drukpadam

యాక్టింగ్ అంటేనే ఇష్టం అందులోనే ఎంజాయ్ చేస్తున్నా …రాజకీయ రంగ ప్రవేశంపై జూనియర్ ఎన్టీఆర్!

Drukpadam

Leave a Comment